Breaking News

టెన్షన్‌.. టెన్షన్‌.. ఇరాన్‌పై భారీ దాడికి అమెరికా సిద్ధం!

Published on Thu, 02/19/2026 - 07:48

అమెరికా, ఇరాన్‌ మధ్య పతాక స్థాయికి ఉద్రిక్తతలు చేరుకున్నాయి. ఇరాన్‌పై సైనికదాడికి అమెరికా సిద్ధమవుతుంది. ఇరాన్‌పై సైనిక చర్యపై ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధవిమానాలు, నౌక దళాలను యూస్‌ మోహరించింది. శనివారం లేదా ఆదివారం ఇరాన్‌పై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం. ట్రంప్‌ తన సలహాదారులతో చర్చిస్తున్నారని వైట్‌హౌజ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇరాన్‌ అణు కార్యక్రమాలు, అంతర్గత అణచివేతపై ట్రంప్‌ సీరియస్‌గా ఉన్నారని.. దీంతో​ ఇరాన్‌పై అమెరికా భారీ దాడులకు దిగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధం కన్నా భారీ స్థాయిలో ఈ సైనిక చర్య ఉండవచ్చని తాజా నివేదికలు చెబుతున్నాయి.

కాగా, అమెరికా తన అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్’ను ఈ ప్రాంతానికి తరలించడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. అమెరికా నౌకాదళాన్ని సముద్ర గర్భంలో ముంచేయగల క్షిపణులు తమ వద్ద ఉన్నాయని, అగ్రరాజ్య సైన్యం కోలుకోలేనంతగా దెబ్బతినడం ఖాయం అంటూ ఆయన ట్రంప్‌ను హెచ్చరించారు.

కాగా, రెండు రోజుల క్రితం(మంగళవారంట) వివాదాస్పద అణు కార్యక్రమానికి ఇరాన్‌ చరమగీతం పాడాలన్న ప్రధాన డిమాండ్‌తో గతంలో జరిగిన తొలి దఫా పరోక్ష అణు చర్చలకు కొనసాగింపుగా జెనీవాలో ఇరాన్, అమెరికాల మధ్య మరోదఫా చర్చలు జరిగాయి. జెనీవాలోని ఒమర్‌ దౌత్యవేత్త అధికారిక నివాసంలో ఒమన్‌ మధ్యవర్తులతో వేర్వేరుగా అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు చర్చలు జరిపారు.

ఈసారి రెండో రౌండ్‌ చర్చలు కేవలం మూడు గంటల్లోనే ముగియడం గమనార్హం. రెండో రౌండ్‌ భేటీలో ఏఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయో తెలియరాలేదు. పరోక్ష చర్చల్లో అమెరికా తరఫున అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్, పశ్చిమాసియాలో ట్రంప్‌ దూత స్టీవ్‌ విట్కాఫ్‌లు పాల్గొన్నారు. ఇరాన్‌ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ముడి చమురు రవాణా నౌకల రాకపోకలను స్తంభింపజేస్తూ హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ కొన్ని గంటలపాట మూసేసింది.

 

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)