Breaking News

పాక్‌లో పదేళ్ల చిన్నారి అపహరణ.. మతమార్పిడి.. 50 ఏళ్ల వ్యక్తితో బలవంతపు పెళ్లి

Published on Thu, 11/21/2024 - 07:03

కరాచీ: పాకిస్తాన్‌లో హిందువుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. మత ఛాందసవాదులు  ఒక చిన్నారిని కిడ్నాప్ చేసి, బలవంతంగా మతమార్పిడి చేయించి, పెళ్లి జరిపించిన ఉదంతం చోటుచేసుకుంది. ఇలాంటి అనేక కేసులు అనేకం వెలుగుచూస్తున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్రలో కనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో పదేళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించిన ఉదంతం  ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పాకిస్తాన్ దారావర్ ఇత్తెహాద్ (మైనారిటీల హక్కుల కోసం ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థ) అధ్యక్షుడు శివకట్చి తెలిపిన వివరాల ప్రకారం సంఘర్‌ ప్రాంతానికి చెందిన 10 ఏళ్ల హిందూ బాలికను 50 ఏళ్ల ముస్లిం వ్యక్తి బలవంతంగా వివాహం చేసుకున్నాడు. అవినీతికి అలవాటు పడిన పోలీసు సిబ్బంది సహకారంతో ఈ వివాహం జరిగిదనే ఆరోపణలున్నాయి. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయవాది సహకారంతో కోర్టులో కేసు వేయడంతో ఈ  ఉదంతం వెలుగు చూసిందని శివకట్చి తెలిపారు.

గ్రామంలోని తమ ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను మిర్‌పుర్‌ఖాస్‌కు చెందిన గులామ్ ముహమ్మద్ అపహరించి, సిర్‌హండి ఎయిర్ సమరో మదర్సాకు తీసుకెళ్లారని శివకచ్చి చెప్పారు. తరువాత ఆ బాలికకు బలవంతంగా మత మార్పిడి చేయించి షాహిద్ తల్పూర్‌ అనే వ్యక్తితో వివాహం జరిపించారని తెలిపారు. అయితే ఆ ప్రాంత న్యాయ అధికారుల చొరవతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ బాలికను సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారని శివకచ్చి తెలిపారు.

ఇది కూడా చదవండి: సగం మంది ఇంటి నుంచే పనిచేయండి

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)