Breaking News

బ్రిగెటీకి సైబర్‌ వేధింపులు... 

Published on Tue, 01/06/2026 - 06:22

పారిస్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ భార్య బ్రిగెటీపై సైబర్‌ వేధింపుల కేసులో 10 మందిని దోషులుగా పారిస్‌ కోర్టు నిర్ధారించింది. వారికి 4 నుంచి ఆర్నెల్ల జైలుశిక్షలు విధించింది. అయితే వాటి అమలును సస్పెండ్‌ చేసింది. బదులుగా సైబర్‌ వేధింపుల అవగాహన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆదేశించింది. విచారణ సందర్భంగా క్షపమాణలు కోరిన ఒక టీచర్‌కు మాత్రం జైలు శిక్ష విధించలేదు. దోషుల్లో ఎనిమిది మంది పురుషులు కాగా ఇద్దరు మహిళలు.

 బ్రిగెటీ ట్రాన్స్‌జెండర్‌ అని, పుట్టుకతో పురుషుడని పేర్కొనడంతో పాటు ఆమెను కించపరిచేలా వీరంతా ఆన్‌లైన్‌లో పలురకాలుగా తప్పుడు సమాచార వ్యాప్తి చేశారని కోర్టు ఆక్షేపించింది. సైబర్‌ వేధింపులపై పోరాటంలో అందరికీ ఆదర్శంగా నిలిచేందుకే వారిపై కేసులు పెట్టినట్టు బ్రిగెటీ వెల్లడించారు. ఆన్‌లైన్‌ వేధింపులు మొదలైనప్పటి నుంచీ ఆమె జీవితం గందరగోళంగా మారిందని కూతురు టిఫైన్‌ అజిరే వాపోయారు. వాటివల్ల తమ కుటుంబమంతా ఇప్పటికీ బాధపడుతూనే ఉందన్నారు.  

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)