Breaking News

ట్రంప్‌కు భారీ మెజార్టీ.. కమలాకు ట్విస్ట్‌ ఇచ్చిన కీలక యూనియన్‌

Published on Thu, 09/19/2024 - 07:12

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు అ‍భ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక, అమెరికా పలు యూనియన్ల ఓట్ల కీలకంగా మారనున్నాయి. కొన్ని యూనియన్ల సభ్యులు డొనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, అమెరికాలో ఇంటర్నేషనల్‌ బ్రదర్‌హుడ్‌ ఆఫ్‌ టీమ్‌స్టర్స్‌ యూనియన్‌కు సంబంధించిన ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారానున్నాయి. ఈ యూనియల్‌లో దాదాపు 1.3 మిలియన్ల సభ్యులు ఉన్నారు. ఈ యూనియన్‌లో ట్రక్‌ డ్రైవర్లు, ఎయిర్‌లైన్స్‌ పైలట్స్‌, జూకీపర్ల వరకు అనేక ఇతర కార్మికులు కూడా ఉన్నారు. ఇక, యూనియన్‌కు సంబంధించి బుధవారం ఎలక్ట్రానిక్‌ పోల్‌ను విడుదల చేశారు. ఈ పోల్స్‌లో ఎక్కువ మంది డొనాల్డ్‌ ట్రంప్‌వైపే మొగ్గుచూపారు.

యూనియన్‌ సభ్యుల జాతీయ ఎలక్ట్రానిక్ పోల్‌ ప్రకారం.. ట్రంప్‌కు 59.6 శాతం ఓట్లు రాగా, కమలా హారీస్‌కు మాత్రం కేవలం 34 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో, కమలాపై ట్రంప్‌ పైచేయి సాధించారు. ఇక, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ఎన్నికల నుంచి తప్పుకోకముందు ఆయనకు మద్దుతుగా 44 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, యూనియన్‌లో మెజార్టీ ఓటర్లు ట్రంప్‌కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఓట్లు అభ్యర్థులు ఇద్దరికీ యూనియన్‌ కీలకంగా మారనుంది. అయితే, 2000 సంవత్సరం నుంచి ఈ యూనియన్‌ సభ్యులు డెమోక్రటిక్‌ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇక, ఈ ఎన్నికల్లో మాత్రం రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థికి సపోర్టు ఇస్తూ పోల్స్‌ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటి వరకు యూనియన్‌ మద్దతు ఇలా..

  • 1984లో ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్‌కు

  • 1988లో వైస్ ప్రెసిడెంట్ జార్జ్ హెచ్‌డబ్ల్యు బుష్‌తో సహా రిపబ్లికన్‌లను ఆమోదించారు.

  • 1996 తర్వాత యూనియన్ ఆమోదం పొందకపోవడం ఇదే మొదటిసారి.

  • 2000 నుండి ప్రతి డెమోక్రాటిక్ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నారు. 
     

ఇది కూడా చదవండి: Israel Hezbollah War: పేజర్‌లో 3 గ్రాముల పేలుడు పదార్థం!

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)