Breaking News

అఫ్గానిస్తాన్‌ తాలిబన్‌ చెర నుంచి బ్రిటిష్‌ దంపతుల విడుదల

Published on Sat, 09/20/2025 - 08:02

దుబాయ్‌: అఫ్గానిస్తాన్‌లో ఏడు నెలలుగా నిర్బంధంలో ఉంచుకున్న బ్రిటన్‌ జంటను తాలిబన్లు శుక్రవారం విడిచిపెట్టారు. పీటర్‌ రేనాల్ట్సŠ(80), బార్బీ రేనాల్డ్స్‌(75) దంపతులు అఫ్గానిస్తాన్‌లోని బామియన్‌లో గత 18 ఏళ్లుగా విద్య, శిక్షణ సంస్థలను నిర్వహిస్తున్నారు. 2021లో అమెరికా ప్రభుత్వం దన్నుతో నడుస్తున్న ప్రభుత్వాన్ని తాలిబన్లు కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాతా వీరు అక్కడే ఉంటున్నారు.

అయితే, వీరు చట్టాలను ఉల్లంఘించారంటూ తాలిబన్‌ యంత్రాంగం అదుపులోకి తీసుకుని, గుర్తు తెలియని ప్రాంతంలో నిర్బంధించింది. బ్రిటన్‌ వినతి మేరకు రంగంలోకి దిగిన ఖతార్‌ ప్రభుత్వం దంపతుల విడుదలపై తాలిబన్లతో చర్చలు జరిపింది. చర్చలు ఫలప్రదం కావడంతో రేనాల్డ్స్‌ దంపతులను తాలిబన్లు విడిచిపెట్టారు. శుక్రవారం వీరు కాబూల్‌ నుంచి విమానంలో స్వదేశానికి బయలుదేరారు. అఫ్గాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల గుర్తింపు లభించలేదు.

దీంతో, వీరు రేనాల్డ్స్‌ దంపతులను నిర్బంధించడం ద్వారా తమ డిమాండ్లపై బేరసారాలకు దిగినట్లుగా భావిస్తున్నారు. అమెరికాకు చెందిన పర్యాటకుడు జార్జి గ్లెజ్‌మాన్‌ను నిర్బధంలోకి తీసుకున్న తాలిబన్లు అనంతరం ఆ దేశంతో ఖైదీల మార్పిడి ఒప్పందం కుదుర్చుకుని, ఇటీవల విడుదల చేయడం తెల్సిందే. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)