Breaking News

జుత్తు సరిగా లేకున్నా అరెస్టే..

Published on Fri, 04/11/2025 - 05:58

కాబూల్‌: రంజాన్‌ మాసంలో మసీదుకు వెళ్లని వారితోపాటు జుత్తు సరిగ్గా కట్‌ చేయించుకోని వారిని కూడా అఫ్గానిస్తాన్‌ తాలిబన్‌ పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా జుత్తు కత్తిరించని క్షురకులను సైతం కటకటాల వెనక్కి నెట్టేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను ప్రకటించిన ఆరు నెలల అనంతరం వాటిని పాటించని వారిపై తాలిబన్లు చర్యలు తీసుకుంటున్నట్లు ఐక్యరాజ్యసమితి గురువారం వెలువరించిన నివేదికలో పేర్కొంది.

 పౌరులు దైనందిన జీవితంలో ముఖ్యంగా రవాణా, సంగీతం, షేవింగ్, వేడుకల సమయంలో ఎలా మెలగాలో నిర్దేశిస్తూ తాలిబన్‌ పాలకులు గతేడాది ఆగస్ట్‌లో నియమ నిబంధనలను ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళల స్వరం వినిపించరాదు, వారి ముఖాలు కనిపించరాదనేవి కూడా ఇందులో ఉన్నాయి. వీటిపై అప్పట్లోనే ఐరాస అభ్యంతరం తెలిపినా తాలిబన్లు పట్టించుకోలేదు. 

ఆగస్ట్‌ తర్వాత అరెస్టయిన వారిలో సగం మంది ఇలా నిబంధనలు పాటించని వారేనని ఐరాస అఫ్గానిస్తాన్‌ మిషన్‌ పేర్కొంది. గడ్డం పొడవు, జుత్తు నిర్దేశించిన మేరకు లేకున్నా గడ్డం ట్రిమ్మింగ్‌ చేసిన క్షురకులను నైతిక విభాగం పోలీసులు నిర్బంధిస్తున్నారని తెలిపింది. ఇటువంటి అరెస్ట్‌లపై ఎలాంటి చట్టపరమైన ప్రక్రియలను అమలు చేయడం లేదని, ఇదంతా ఏకపక్షంగా సాగుతోందని పేర్కొంది. 

రంజాన్‌ మాసంలో సామూహిక ప్రార్ధనలను తాలిబన్లు తప్పనిసరి చేశారు. నిఘా పెట్టిన నైతిక పోలీసులు సామూహిక ప్రార్థనల్లో పాలుపంచుకోని వారిని ఎలాంటి హెచ్చరికలు లేకుండానే అదుపులోకి తీసుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది. 

ఇలాంటి చర్యలతో చిన్న వ్యాపారాలు, ప్రైవేట్‌ విద్యాసంస్థలు, హెయిర్‌ డ్రెస్సింగ్‌ సెంటర్లు, టైలర్లు, రెస్టారెంట్లు, వెడ్డింగ్‌ కేటరర్లకు పని దొరక్కుండా పోయిందని, ఆయా వ్యాపారాలు మూతబడే పరిస్థితికి చేరుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామాన్యుల జీవనం మరింత భారంగా మారిందని ఐరాస తెలిపింది. 

మహిళలకు విద్య, ఉద్యోగావకాశాలు లేకుండా చేయడంతో అఫ్గానిస్తాన్‌ ఏడాదికి 14 బిలియన్‌ డాలర్ల మేర నష్టపోతోందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అయితే, అఫ్గాన్‌ సమాజం, ప్రజలను సంస్కరించేందుకే ఇస్లామిక్‌ చట్టాలను అమలు చేస్తున్నామని తాలిబన్‌ నేత హైబతుల్లా అఖుంద్‌జాదా చెప్పుకుంటున్నారు. నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 3,300 మంది ఇన్‌స్పెక్టర్లను తాలిబన్‌ ప్రభుత్వం నియమించింది.  
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)