Breaking News

టీ రెక్స్‌ అంటే.. డైనోసార్‌ సినిమాల్లో హీరో లెక్క

Published on Fri, 09/30/2022 - 08:28

టీ రెక్స్‌ అంటే.. డైనోసార్‌ సినిమాల్లో హీరో లెక్క.. దానికో సెపరేటు ఇంట్రడక్షన్‌ మస్టు. ఇప్పటివరకూ వచ్చిన ఏ డైనోసార్‌ సినిమా చూసినా దాని తర్వాతే మరెవరైనా.. అలాంటి టీ రెక్స్‌ను సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు దక్కింది. అంటే.. డైరెక్ట్‌గా రాక్షసబల్లి అని కాదు.. దాని అస్థిపంజరం అన్నమాట. తొలిసారిగా ఆసియాలో ఇదిగో ఈ 43 అడుగుల పొడవు, 16 అడుగుల ఎత్తు ఉన్న టీ రెక్స్‌ను వేలం వేయనున్నారు. 6.8 కోట్ల ఏళ్ల క్రితం జీవించిన ఈ టీ రెక్స్‌ అస్థిపంజరం ఉత్తర అమెరికాలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. ఇప్పటివరకూ ప్రపంచంలో మరో రెండు టీ రెక్స్‌లను మాత్రమే వేలం వేశారట.

చెప్పడం మరిచాం.. దీని పేరు షెన్‌ అట. ఏం చూసి ఆ పేరు పెట్టారని మాత్రం అడగకండి.. మాక్కూడా తెలియదు. మీరు గానీ.. దీన్ని కొనుక్కుంటే మీకు నచ్చినట్లుగా అప్పారావ్, సుబ్బారావ్‌ అని మార్చేసుకోవచ్చు. నవంబర్‌ 30న హాంకాంగ్‌లో దీన్ని వేలం వేస్తున్నారు. కొనాలన్న ఆసక్తి ఉంటే మాత్రం ఓ రూ.200 కోట్లు రెడీ చేసుకోండి. ఎందుకంటే.. ఈ అస్థిపంజరం ఆ మాత్రం ధర పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు. విషయం అర్థమైందిగా..ఈ అస్థిపంజరం కొనాలంటే.. మన ఆస్తులు అమ్మితే సరిపోదు.. ఇరుగుపొరుగు, బంధుమిత్రుల ఆస్తులు కూడా అమ్ముకొని.. రంగంలోకి దిగాలన్నమాట. మరి రెడీనా..?
చదవండి: అబార్షన్‌ రూల్స్.. ఏ దేశంలో ఎలా?

Videos

అటు పార్టీలోనూ...ఇటు ప్రభుత్వంలోనూ డాడీని డమ్మీని చేస్తున్న లోకేశ్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి ఓవరాక్షన్

నమ్మించి నట్టేట ముంచారు చంద్రబాబుపై మహిళలు ఫైర్

ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతల హౌస్ అరెస్టులు

Rain Alert: వారం రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు

Charminar Gulzar House: ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి

డోర్ లాక్ పడి..నలుగురు చిన్నారులు మృతి

Nagarjuna Yadav: రైతులపై పగ.. పెట్టుబడి సాయం జీరో, రైతు భరోసా జీరో

KSR Paper Analysis: ఈరోజు ముఖ్యాంశాలు

TDP నేతల చేతిలో దాడికి గురై.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జేమ్స్

Photos

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)