Breaking News

సిరియా సంక్షోభం.. అసద్‌ కుటుంబానికి అండగా పుతిన్‌

Published on Mon, 12/09/2024 - 07:15

మాస్కో: తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సిరియా అధ్యక్షుడు బషర్‌-అల్‌-అసద్‌ దేశాన్ని విడిచివెళ్లిపోవడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది. 

ఇదే సమయంలో ఆయన విమాన ప్రమాదంలో మరణించారనే వార్తలు సైతం చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో అసద్‌ రష్యాలో ఉన్నట్టు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. రష్యా మీడియా ప్రకటనలో ఊహాగానాలకు చెక్‌ పెట్టినట్టు అయ్యింది.

సిరియాలో తిరుగుబాటు దళాలు డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో సిరియా అధ్యక్షుడు అసద్‌ తన కుటుంబంతో సహా విమానంలో బయలుదేరారు. అనంతరం, ఆయన విమానం ఆచూకీ తెలియకపోవడంతో ప్రమాదానికి గురైనట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై మొదట రష్యా స్పందిస్తూ.. అసద్‌ చనిపోలేదని క్లారిటీ ఇచ్చింది. అనంతరం, అసద్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు చేరినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా, మానవతా సాయం కోణంలో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించినట్టు చెప్పుకొచ్చాయి. ఈ ప్రకటనలో అసద్‌.. రష్యాలో సురక్షితంగా ఉన్నారని తెలిసింది.

ఇదిలా ఉండగా.. సిరియాలో తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం బషర్‌ సిరియాను వీడారని రష్యా పేర్కొంది. ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయానికి వచ్చారని, అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగు సూచనలు ఇచ్చారని రష్యా విదేశాంగశాఖ వెల్లడించింది.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)