Breaking News

స్వీడన్‌లో కాల్పులు.. 10 మంది మృతి

Published on Wed, 02/05/2025 - 06:10

ఒరెబ్రో: ప్రశాంత వాతావరణానికి మారుపేరైన స్వీడన్‌లో కాల్పులు కలకలం రేపాయి. రాజధాని స్టాక్‌హోంకు 200 కిలోమీటర్ల దూరంలోని ఒరెబ్రోలో జరిగిన కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నగర శివార్లలోని రిస్‌బెర్గ్‌స్కా వయోజన విద్యా కేంద్రం క్యాంపస్‌లో మంగళవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ప్రైమరీ, అప్పర్‌ సెకండరీ స్కూళ్లు ఉన్నాయి. ఇక్కడే వలసదారులకు స్వీడిష్‌ బోధిస్తారు. తరగతులు ముగియడంతో చాలా మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారని, కాల్పుల సమయంలో అక్కడ కొద్ది మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం.

మృతుల్లో కాల్పులకు తెగబడిన వ్యక్తి కూడా ఉన్నాడు. అతడొక్కడే ఈ దారుణానికి పాల్పడినట్లుగా భావించడం లేదని పోలీసులు తెలిపారు. దుండగుడిని గుర్తించాల్సి ఉందన్నారు. గాయాలతో చికిత్స పొందుతున్న వారి సంఖ్యను పోలీసులు వెల్లడించలేదు. ఘటన ప్రాంతంలో భీతావహ పరిస్థితిని బట్టి చూస్తే మరణాల సంఖ్యను కచ్చితంగా చెప్పలేమని ఓ అధికారి చెప్పడం గమనార్హం. దారుణానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు. ప్రస్తుతానికైతే ఉగ్ర లింకులున్నట్లు చెప్పలేమన్నారు. అధికారులు మృతులను గుర్తించే పనిలో ఉన్నారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)