Breaking News

ఆకాశహర్మ్యాల నడుమ... అద్భుత దృశ్యం!

Published on Thu, 05/29/2025 - 02:43

ఎత్తైన గుట్టలు, మధ్యలో అస్తమిస్తున్న సూర్యుడు. ఇలాంటి ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించని, ఆనందించని వారుండరు. అలాంటి దృశ్యాల కోసమే చాలామంది ప్రత్యేకంగా ప్రయాణాలు కూడా చేస్తుంటారు. మరి మహానగరాల్లో సూర్యస్తమయం ఎలా ఉంటుంది? ఉరుకుల పరుగుల జీవితాల్లో ఎవరూ అంతగా పట్టించుకోరు! కానీ న్యూయార్క్‌ మహానగరంలో మాత్రం బుధవారం నాటి అందమైన సాయంత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. 

హడ్సన్‌ నదికి ఆవల సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తుండగా ఆకాశహర్మ్యాల  నడుమ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. న్యూయార్క్‌లోని మన్‌హాటన్‌ వీధుల్లో ఆకాశాన్ని తాకే భవనాల మధ్య సూర్యుడు పసుపు, నారింజ, ఎరుపు రంగుల్లో వెలిగిపోతూ అస్తమించే దృశ్యన్ని చూడటానికి జనం ఎగబడతారు. దీన్ని మన్‌హాటన్‌హెంజ్‌గా పిలుస్తారు. ఈ అందమైన దృశ్యం ఈ ఏడాది మే 28, 29ల్లో తిరిగి జూలై 11, 12 తేదీల్లో మాత్రమే కనిపిస్తుంది.

 తొలి మన్‌హాటన్‌హెంజ్‌ బుధవారం రాత్రి 8:13 గంటలకు, అంటే భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5.43కు కనిపిస్తుంది. మన్‌హాటన్‌లోని 14, 23, 34, 42, 57వ నంబర్‌ వీధుల్లో ఈ దృశ్యాన్ని చూడవచ్చు. షికాగో, బాల్టిమోర్, కెనడాలోని టొరంటో వంటి నగరాల్లోనూ ఇలాంటి సూర్యాస్తమయాలు కనువిందు చేస్తాయి. కానీ అన్నింట్లోకీ మన్‌హాటన్‌హెంజే బాగా ప్రసిద్ధమైనది.

మన్‌హాటన్‌ అనే పదాన్ని ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్‌ డిగ్రాస్సే టైసన్‌ 1997లో ప్రయోగించారు. ఆయన యుక్తవయసులో ఉండగా ఇంగ్లండ్‌లోని స్టోన్‌హెంజ్‌ను సందర్శించారు. ఆ నిలువురాళ్ల గుండా కనువిందు సూర్యాస్తమయం ఆయనను అమితంగా ఆకట్టుకుంది. తర్వాత తన స్వస్థలమైన న్యూయార్క్‌లోని మన్‌హాటన్‌ భవనాల గుండా సూర్యాస్తమయ హొయలు స్టోన్‌హెంజ్‌ సూర్యాస్తమయాన్ని పోలి ఉండటం ఆయనను ఆశ్చర్యపరిచింది. అందుకే ఆ పేరు పెట్టారు. 
 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)