Breaking News

Sunita Williams: సునీతా విలియమ్స్‌ను స్వాగతించిన డాల్ఫిన్లు

Published on Wed, 03/19/2025 - 10:55

వాషింగ్టన్: అమెరికన్ వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్‌లను సముద్రంలోని డాల్ఫిన్లు స్వాగతించాయి. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుండి భూమికి తిరిగి వచ్చిన ఈ వ్యోమగాములను చూసి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి డాల్ఫిన్ల ఆనందం కూడా తోడయ్యింది. పలు ఇబ్బందుల  అనంతరం అంతరిక్ష నౌక చివరకు వ్యోమగాములతో పాటు ఫ్లోరిడా బీచ్‌లో దిగింది.
 

భారత కాలమానం ప్రకారం ఈ ల్యాండింగ్(Landing) బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ సమయంలో నాసా బృందం  వ్యోమగాములను స్వాగతించడానికి  చిన్నపాటి షిప్‌లతో సిద్ధమయ్యింది. ఈ సమయంలో సముద్రంలో  అరుదైన దృశ్యం కనిపించింది. సునీతా విలియమ్స్ ఉన్న క్యాప్స్యూల్‌ను పలు డాల్ఫిన్లు చుట్టుముట్టాయి. డాల్ఫిన్ల గుంపు అంతరిక్ష నౌక చుట్టూ ఈదుతూ కనిపించింది. సునీతా విలియమ్స్‌తో పాటు ఆమె సహచరులను క్యాప్సూల్ నుండి బయటకు తీసుకువస్తున్నప్పుడు పలు డాల్ఫిన్లు క్యాప్సూల్ చుట్టూ గుమిగూడాయి.

దీనికి సంబంధించిన వీడియోను నాసా సిబ్బంది సాయర్ మెరిట్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘స్పేస్‌ ఎక్స్‌కు చెందిన  డ్రాగన్ క్యాప్సూల్ చుట్టూ  డాల్ఫిన్లు ఈదుతున్నాయి’ అని రాశారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాగా రికవరీ నౌక వ్యోమగాములను క్యాప్సూల్ నుండి బయటకు తీసుకువచ్చాక, వారిని 45 రోజుల పునరావాస కార్యక్రమం కోసం హ్యూస్టన్‌లోని ఒక కేంద్రానికి తరలించారు. 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)