Breaking News

సునీతా విలియమ్స్‌ రాకకు సమయం ఆసన్నం

Published on Sat, 03/01/2025 - 13:20

అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమ్స్‌, బుచ్ విల్మోర్‌ల రాకకోపం ఎదురుచూస్తున్నవారికి అమెరికాకు చెందిన నేషనల్‌ ఏరోనాటిక్స్‌, స్పేస్‌ అడ్మినిష్ట్రేషన్‌(నాసా) శుభవార్త చెప్పింది. వీరు అంతరిక్షం నుంచి 2025, మార్చి చివరిలో భూమికి తిరిగి రానున్నట్లు వెల్లడించింది. సాంకేతిక ఇబ్బందులు, మిషన్ రీషెడ్యూలింగ్ కారణంగా ఈ ఇద్దరు వ్యోమగాములు గత ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు.

నాసా తాజాగా తెలిపిన వివరాల ప్రకారం క్రూ-10 మిషన్ మార్చి 12న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కు బయలుదేరుతుంది. ఈ మిషన్‌లో అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్ (నాసా), టకుయా ఒనిషి (జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ), కిరిల్ పెస్కోవ్ (రోస్కోస్మోస్) ఉన్నారు. వీరు అంతరిక్షంలోకి చేరుకున్నాక, క్రూ-9 మిషన్ (సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కూడినది) భూమికి తిరిగి వస్తుంది. 

క్రూ-10 మిషన్ మార్చి 12న ప్రారంభమవుతుందని, ఒక వారం పాటు ఐఎస్‌ఎస్‌లో ఉంటుందని బుచ్ విల్మోర్ తెలిపారు. దీని తరువాత ఆ వ్యోమగాములు మార్చి 19 నాటికి భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. నాసా,  స్పేస్‌ఎక్స్‌లు ఈ మిషన్‌ను వేగవంతం చేశాయి.

ఈ మిషన్‌లో జరుగుతున్న జాప్యంపై స్పేస్‌ఎక్స్ సీఈవో ఇలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తూ, వ్యోమగాములను ఇంత కాలం ఐఎస్‌ఎస్‌లో వదిలివేయడం సరికాదని అన్నారు.  కాగా ఈ మిషన్‌లో పోలాండ్, హంగేరీల వ్యోమగాములతో పాటు భారత సంతతికి చెందిన శుభాన్షు శుక్లాను కూడా ఐఎస్‌ఎస్‌కు పంపనున్నారు. ఈ మిషన్‌ విజయవంతమైతే శుభాన్షు ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన మొదటి భారతీయునిగా నిలుస్తారు.  మార్చి 19న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయని నాసా పేర్కొంది. 

ఇది  కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)