Breaking News

అంతరిక్షంలో అంతుబట్టని వస్తువు

Published on Mon, 06/09/2025 - 06:29

అంతరిక్షం అనంత రహస్యాల పుట్ట. మానవుడు ఇప్పటికీ గుర్తించని వింతలు, విడ్డూరాలకు అంతరిక్షంలో కొదవేలేదు. ఖగోళ శాస్త్రవేత్తలకు తాజాగా ఓ వింత అనుభవం ఎదురైంది. డీప్‌ స్పేస్‌లో ఓ గుర్తు తెలియని వస్తువును కనిపెట్టారు. అదేమిటన్నది వారికే అంతుబట్టడం లేదు. ఆ వస్తువు నుంచి రేడియో, ఎక్స్‌ తరంగాలు వెలువడుతున్నట్లు గుర్తించారు. అందులో తరచుగా పేలుళ్లు సంభవిస్తూ తరంగాలను ఉత్పత్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. 

ఈ వివరాలను జర్నల్‌ నేచర్‌లో ప్రచురించారు. ఈ అంతుబట్టని వస్తువు నుంచి ప్రతి 44 నిమిషాలకోసారి రెండు నిమిషాలపాటు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది చాలా అసాధారణమని సైంటిస్టులు అంటున్నారు. ఇలాంటి పరిణామం మునుపెన్నడూ చూడలేదని స్పష్టంచేస్తున్నారు. ఇప్పటిదాకా అంతరిక్షంలో గుర్తించిన వస్తువుల్లో ఇలా తక్కువ సమయంలో తరచుగా సంకేతాలు వెలువడినట్లు తేలలేదు. 

ఈ కొత్త వస్తువును లాంగ్‌ పిరియడ్‌ ట్రాన్సియంట్‌(ఎల్‌పీటీ) కేటగిరీలో చేర్చారు. ఇది మ్యాగ్నేటర్‌ కావొచ్చని అంచనా వేస్తున్నారు. మృత నక్షత్రానికి చెందిన అత్యధిక ఆయస్కాంత శక్తి కలిగిన అవశేషాన్ని మ్యాగ్నేటర్‌ అంటారు. రాబోయే రోజుల్లో రేడియో, ఎక్స్‌–రే టెలిస్కోప్‌ల ద్వారా ఇలాంటి వస్తువులను మరిన్ని గుర్తించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. విశ్వం ఆవిర్భావం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇవి దోహదపడతాయని చెబుతున్నారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)