Breaking News

'నాకు క‌రోనా వ‌చ్చి మేలు చేసింది'

Published on Fri, 07/31/2020 - 16:51

నెబ్రాస్కా : 'నా జీవితంలోకి క‌రోనా వైర‌స్ వ‌చ్చి మంచిప‌ని చేసింద‌ని' నెబ్రాస్కాకు చెందిన 73 ఏళ్ల డోరిక్ క్రిప్ప‌న్ అంటున్నారు.. అదేంటి ఒక‌ప‌క్క వైర‌స్‌తో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మ‌వుతుంటే ఈమె ఇలా అంటుందేంటి అనుకుంటున్నారా.. కానీ ఆమె చెప్పింది అక్ష‌రాలా నిజం.. ఎందుకంటే 53 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కా, చెల్లిని క‌లిపింది క‌రోనానే. డోరిక్ క్రిప్ప‌న్‌కు క‌రోనా రావ‌డంతోనే ఎప్పుడో విడిపోయిన త‌న చెల్లిని క‌లుసుకుంది. ఇక ఇప్పుడు అస‌లు విష‌యానికి వ‌చ్చేద్దాం.

అది 1967వ సంవత్స‌రం.. డోరిక్ క్రిప్ప‌న్‌, బెవ్ బోరో ఇద్ద‌రు తోబుట్టువులు.. అప్ప‌టికే డోరిక్ వ‌య‌స్సు 20 ఏళ్లు కాగా.. బెవ్ బోరో వ‌య‌స్సు.. ఆరు నెల‌లు మాత్ర‌మే..  డోరిక్ త‌న చెల్లిని కంటికి రెప్ప‌లా కాపాడుకునేది. కాని త‌ల్లిదండ్రుల మ‌ధ్య ఏర్ప‌డిన మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా వారిద్ద‌రు విడిపోయారు. బెవ్ బోరో త‌న తండ్రి వ‌ద్ద పెరిగింది. అయితే బోరో త‌న అక్క పేరు మాత్రం గుర్తుపెట్టుకుంది. అప్ప‌టినుంచి ఈ 53 ఏళ్లో వారిద్ద‌రు ఒక్క‌సారి కూడా క‌ల‌సుకోలేక‌పోయారు.(పోగాకు ఆకులతో కరోనా టీకా)

క‌ట్‌చేస్తే.. 73 ఏళ్ల డోరిక్ క్రిప్ప‌న్‌.. ప్ర‌స్తుతం నెబ్రాస్కాలో నివనివ‌సిస్తుంది. 53 ఏళ్ల బెవ్ బోరో ఫ్రీమౌంట్‌లోని మెథోడిస్ట్ ఆసుప‌త్రిలో మెడికో ఫార్మాసిస్ట్‌గా ప‌నిచేస్తుంది. కొన్నిరోజుల క్రితం.. డోరిక్‌కు క‌రోనా సోక‌డంతో బెవ్ బోరో ప‌నిచేస్తున్న ఆసుప‌త్రిలోనే చేరి చికిత్స తీసుకుంటుంది. అయితే ఒక‌రోజు పేషేంట్ల‌కు మందులు ఇవ్వ‌డానికి బెవ్ బోరో రోగుల పేర్లు ఉన్న లిస్ట్ బోర్డ్ చ‌చూసింది. అందులో డోరిక్ క్రిప్ప‌న్ అనే పేరు కూడా ఉంది. ఆ పేరు చూసి బ‌హుశా త‌న అక్క అయ్యుంట‌ద‌న్న ఆలోచ‌న‌లో అదే లిస్ట్ బోర్డును తీసుకోని డోరిక్ వ‌ద్ద‌కు వెళ్లింది.

ఆ బోర్డుపై బెవో త‌న తండ్రి వెండాల్ హ‌ఫ్‌మ‌న్ పేరును రాసింది. ఇతని పేరు మీకు తెలుసా అంటూ డోరిక్‌ను అడిగింది.. అది చూసిన డోరిక్ ' తెలుసు ఆయ‌న మా నాన్న‌.. నువ్వు నా చెల్లి బెవ్ బోరో క‌దా' అంటూ క‌న్నీటిప‌ర్యంత‌మైంది. అప్ప‌టివ‌ర‌కు వీల్‌చైర్‌లో ఉన్న డోరిక్ బెవ్‌ను ద‌గ్గ‌రికి తీసుకునే ప్ర‌య‌త్నంలో కిందప‌డింది. కానీ సంతోషంలో ఉన్న డోరిక్ అది ప‌ట్టించుకోకుండా బెవ్ ద‌గ్గ‌రికి వెళ్లి..' దేవుడు మ‌నిద్ద‌రిని 53 ఏళ్లు విడ‌దీశాడు.. ఇన్ని సంవ‌త్సారాల్లో నిన్ను ఎన్నోసార్లు వెత‌క‌డానికి ప్ర‌య‌త్నించా.. కానీ క‌రోనా మ‌న‌ల్ని క‌లుపుతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు' అంటూ డోరిక్ బావోద్వేగానికి గుర‌యింది. విష‌యం తెలుసుకున్న ఆసుప‌త్రి సిబ్బంది వారి కుటుంబ‌స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. దీంతో ఇరు కుటుంబాల్లో సంతోషం నెల‌కొంది.

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)