Breaking News

బంఫర్‌ ఆఫర్‌ అంటే ఇదే! జాబ్‌ నుంచి తీసేసినందుకు రూ.210 కోట్లు వచ్చాయ్‌

Published on Fri, 06/16/2023 - 14:05

వాషింగ్టన్‌: జాతివివక్ష నెపంతో తనను జాబ్‌ నుంచి తొలగించారని ఓ ఉద్యోగిని వేసిన కేసులో ప్రముఖ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఉద్యోగినికి 25.6 మిలియన్ల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.210కోట్లు) చెల్లించాలని ఫెడరల్‌ జ్యూరీ సంస్థను ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.. ఫిలిప్స్‌ అనే మహిళ పని చేస్తున్న దుకాణంలో ఇద్దరు నల్లజాతీయులు వచ్చారు. కాసేపటి తర్వాత వారిలో ఒకరు దుకాణంలోని వాష్‌రూంని వాడుకుంటామని ఆమెను అడిగారు. అయితే స్టోర్‌లో ఏమి కొనుగోలు చేయన కారణంగా సిబ్బంది అందుకు అంగీకరించలేదు. అయితే తాము వ్యాపారం పని మీద ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నామని వాళ్లు చెప్పారు. దీంతో ఆగ్రహించిన స్టోర్‌ సిబ్బంది.. వెంటనే అక్కడి నుంచి వెళ్లాలని సూచించగా.. అందుకు వారిద్దరూ నిరాకరించారు. చివరికి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ వ్యవహారమంతా అ‍క్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ కావడం.. అది కాస్త వైరల్‌ కావడంతో తీవ్ర నిరసనకు దారితీసింది.

ఆ ఆందోళనలు సద్దుమణిగేలా చేసేందుకు సంస్థ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా రీజినల్‌ మేనేజర్‌ షానన్‌ ఫిలిప్స్‌ను ఉద్యోగం నుంచి తొలగించి.. దుకాణ మేనేజర్‌ను మాత్రం విధుల్లోనే ఉంచింది. రీజినల్‌ మేనేజర్‌ శ్వేత జాతీయురాలు కాగా, మేనేజర్‌ నల్ల జాతీయుడు కావడం గమనార్హం. శ్వేతజాతీయురాలినైన తనపై జాతి వివక్ష ప్రదర్శించి శిక్షించారంటూ ఆమె 2019లో స్టార్‌బక్స్‌పై దావా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యూజెర్సీలోని ఫెడరల్‌ జ్యూరీ.. స్టార్‌బక్స్‌ సంస్థకు 25.6 మిలియన్ల డాలర్ల జరిమానాను విధించింది.

చదవండి: ఇదేం పాడు పని.. మార్చురీలోని శవాలతో వ్యాపారం!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)