Breaking News

ఆమె టైమ్‌ బాలేదు! 

Published on Fri, 12/12/2025 - 06:37

సాధారణంగా ఉద్యోగులు ఆలస్యంగా ఆఫీసుకు వస్తేనే కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటాయి. కానీ, స్పెయిన్‌లో ఒక మహిళ.. చాలా ముందుగా ఆఫీసుకు వస్తోందన్న కారణంతో ఆమెను ఉద్యోగం నుంచి పీకేశారు. మీరు చదివింది నిజమే.. స్పెయిన్‌లో రూల్‌ అంటే రూలే మరి. 

మేనేజర్ల ఆదేశాలుబేఖాతర్‌.. 
స్పెయిన్‌కు చెందిన 22 ఏళ్ల ఒక ఉద్యోగిని అధికారికంగా ఉద యం 7.30 గంటలకు పని ప్రారంభించాలి. కానీ, ఆమె అలవాటు ప్రకారం రోజూ దాదాపు 6.45 గంటలకే కార్యాలయానికి చేరుకునేది. ఒకరోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాదికి పైగా ఇదే పద్ధతిని పాటించింది. ఈ విషయంలో కంపెనీ ఆమెకు చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సమయంలో ఆమెకు కేటాయించిన పనులేవీ లేవని, ముందే రాకూడదని స్పష్టంగా చెప్పినా.. ఆమె వినిపించుకోలేదు.

ఎందుకుముందే వచ్చావ్‌! 
కంపెనీ యాజమాన్యానికి సహనం నశించింది. ఆదేశాలను ఉద్యోగిని పట్టించుకోకపోవడం, నియమాలను ఉల్లంఘించడం తీవ్రమైన దు్రష్పవర్తనగా భావించింది. ‘ఇది కేవలం ఉత్సాహం కాదు, కంపెనీ ఆదేశాలను పదేపదే ధిక్కరించడమే’.. అని మేనేజర్లు స్పష్టం చేశారు. ఆ సమయంలో చేయగలిగిన ముఖ్యమైన పనులేవీ లేనప్పటికీ, కావాలనే పదేపదే ఆదేశాలను బేఖాతర్‌ చేయడంతో ఆమెను ఉద్యోగం నుండి తొలగించారు.

న్యాయస్థానంలో నూచుక్కెదురు
కంపెనీ నిర్ణయంతో ఆగ్రహించిన ఆ మహిళ.. తన తొలగింపు అన్యాయమని వాదిస్తూ అలికెంట్‌ సోషల్‌ కోర్టులో సవాలు చేసింది. అయితే, కోర్టులో విచారణ సందర్భంగా.. సంస్థ ఎన్ని హెచ్చరికలు చేసినా ఆమె అదే అలవాటును కొనసాగించిందని తేలింది. కొన్నిసార్లు, ఆమె ఆఫీసుకు రాకముందే కంపెనీ యాప్‌లో లాగిన్‌ కావడానికి కూడా ప్రయతి్నంచినట్లు కోర్టు దృష్టికి వచి్చంది.

రూల్‌ అంటే రూలే మరి..
న్యాయమూర్తి.. ఉద్యోగం నుండి తొలగించడానికి కారణం ‘ముందే ఆఫీస్‌కు రావడం’కాదని, పనిచేసే చోట నియమాలను పాటించడానికి నిరాకరించడమే ప్రధాన కారణమని తన తీర్పులో స్పష్టం చేశారు. ఉద్యోగుల చట్టం ఆర్టికల్‌ 54 ప్రకారం ఇది నిబంధనల ఉల్లంఘనే అని తేలి్చ, కంపెనీ తొలగింపు నిర్ణయాన్ని కోర్టు సమరి్థంచింది. ప్రస్తుతానికి తీర్పు మారకపోయినా, ఆమె ఇంకా వాలెన్సియా సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంది.     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌


 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)