స్పేస్‌ఎక్స్‌ స్టార్‌షిప్‌ రాకెట్‌... ప్రయోగం విఫలం 

Published on Fri, 01/17/2025 - 07:08

టెక్సాస్‌: అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న ఎలాన్‌ మస్క్‌ సంస్థ ‘స్పేస్‌ఎక్స్‌’కు చేదు అనుభవం ఎదురైంది. స్పేస్‌ఎక్స్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ పునరి్వనియోగ రాకెట్‌ ‘స్టార్‌షిప్‌’ ప్రయోగం విఫలమైంది. 123 మీటర్ల (400 అడుగులు) పొడవైన ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికే పేలిపోయింది. శకలాలు కరీబియన్‌ సముద్రంలో పడిపోయాయి. 

రాకెట్‌ బూస్టర్‌ మాత్రం క్షేమంగా భూమిపైకి తిరిగివచ్చింది. టెక్సాస్‌లోని లాంచ్‌ప్యాడ్‌ హస్తాలు బూస్టర్‌ను చక్కగా ఒడిసిపట్టుకున్నాయి. టెక్సాస్‌లో మెక్సికో సరిహద్దులోని బొకా చికా బీచ్‌ నుంచి స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.37 నిమిషాలకు స్టార్‌షిప్‌ రాకెట్‌ను ప్రయోగించారు. ఇది 10 డమ్మీ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. 8 నిమిషాల తర్వాత రాకెట్‌తో సంబంధాలు తెగిపోయాయి. 

స్పేస్‌క్రాఫ్ట్‌లోని ఆరు ఇంజన్లు ఒకదాని తర్వాత ఒకటి పనిచేయడం ఆగిపోయింది. రాకెట్‌ భూమిపైకి తిరిగివస్తూ గాల్లోనే పేలిపోయింది. శకలాలు నిప్పుల వర్షాన్ని తలపించాయి. కేవలం ప్రయోగాత్మకంగానే స్టార్‌షిప్‌ను ప్రయోగించినట్లు స్పేస్‌ఎక్స్‌ అధికార ప్రతినిధి డాన్‌ హౌట్‌ చెప్పారు. బూస్టర్‌ క్షేమంగా తిరిగిరావడం సంతోషకరమే అయినప్పటికీ రాకెట్‌ పేలిపోవడం బాధాకరమని అన్నారు.

 ప్రయోగం విఫలమైనప్పటికీ ఇది స్టార్‌షిప్‌ విశ్వసనీయతను మరింత పెంచిందని తెలిపారు. ఇలాంటి వైఫల్యాలు పునరావృతం కాకుండా జాగ్రత్తవహిస్తామని పేర్కొన్నారు. డమ్మీ శాటిలైట్లను అంతరిక్షంలో ఎలా వదిలిపెట్టాలన్న దానిపై సాధనకోసం స్టార్‌షిప్‌ను ప్రయోగించామని వివరించారు. మరోవైపు రాకెట్‌ శకలాలు సముద్రంలో పడిపోతున్న దృశ్యాలను స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

 విజయం సంగతి ఏమోగానీ వినోదం మాత్రం లభించిందని చమత్కరించారు. ఇంధనం లీకేజీ వల్లే రాకెట్‌ ప్రయోగం విఫలమైనట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దది, శక్తివంతమైనది అయిన స్టార్‌షిప్‌ రాకెట్‌కు సంబంధించి ఇది ఏడో ప్రయోగం కావడం విశేషం. ఈ రాకెట్‌ సాయంతోనే అంగారక గ్రహంపై అడుగు పెట్టాలని ఎలాన్‌ మస్క్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మరోవైపు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ రెండు స్టార్‌షిప్‌ రాకెట్ల కోసం ఇప్పటికే ఆర్డర్‌ ఇచ్చింది.


 

#

Tags : 1

Videos

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!

వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

Photos

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)