Breaking News

అంతరిక్షం నుంచి ఐక్యతా గీతం

Published on Sat, 09/14/2024 - 05:11

అంతరిక్షంలో తొలి ప్రైవేట్‌ స్పేస్‌ వాక్‌ చేసిన వ్యోమగాముల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన స్పేస్‌ ఎక్స్‌ ఇంజనీర్‌ సారా గిలిస్‌ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ సినిమా ‘స్టార్‌వార్స్‌: ద ఫోర్సెస్‌ అవేకెన్స్‌’లోని ప్రఖ్యాత ‘రేస్‌ థీమ్‌’ను అంతరిక్షం నుంచే పర్‌ఫామ్‌ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. 

పొలారిస్‌ డాన్‌ ప్రైవేట్‌ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్‌ఎస్‌కు ప్రయాణించిన స్పేస్‌ ఎక్స్‌కు చెందిన డ్రాగన్‌ వ్యోమనౌక నుంచే ఆమె ఈ మ్యూజికల్‌ ట్రిబ్యూట్‌లో పాల్గొన్నారు. సోలో వయోలిన్‌ను సారా వాయించగా పూర్తిస్థాయి ఆర్కెస్ట్రా బృందం భూమి నుంచి ఆమెకు వాద్య సహకారం అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘హార్మనీ ఆఫ్‌ రెసీలియన్స్‌’ పేరిట పొలారిస్‌ ప్రోగ్రాం బృందం శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

 ‘‘విశ్వభాష అయిన సంగీతమే ఈ వీడియోకు స్ఫూర్తి. అలాగే బాలల్లో క్యాన్సర్‌ తదితర మహమ్మారులపై పోరాటం కూడా. చుక్కలనంటే ఉన్నత ఆశయాలను నిర్దేశించుకునేలా తర్వాతి తరాన్ని ప్రేరేపించడమే దీని ఉద్దేశం’’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. ‘అందమైన మన పుడమి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ ఆనంద క్షణాలను సంగీతమయంగా మార్చి మీ అందరితో పంచుకునేందుకు చేసిన ఓ చిన్న ప్రయత్నమిది’ అంటూ సారా గొంతుతో వీడియో ముగుస్తుంది.

 ‘‘మానవాళి ఐక్యతకు, మెరుగైన ప్రపంచపు ఆకాంక్షలకు ఈ ప్రయత్నం ఓ ప్రతీక. బాలల్లో నిబిడీకృతమై ఉండే అనంతమైన ప్రతిభా పాటవాలకు ఇది అంకితం’’ అని సారా పేర్కొన్నారు. పొలారిస్‌ డాన్‌ మిషన్‌ కమాండర్‌ జరేద్‌ ఐజాక్‌మ్యాన్‌తో పాటు సారా గురువారం స్పేస్‌ వాక్‌ చేయడం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి నాన్‌ ప్రొఫెషనల్‌ వ్యోమగాములుగా వారు నిలిచారు. ఈ వీడియో తయారీలో సెయింట్‌ జూడ్‌ చి్రల్డన్స్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌ కూడా పాలుపంచుకుంది.                       

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)