Breaking News

ఐఎస్‌ఎస్‌కు నలుగురు వ్యోమగాముల్ని పంపిన నాసా

Published on Fri, 10/02/2026 - 18:30

కేప్‌ కానవెరాల్‌: స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌లో (SpaceX launches Crew-13) నాసా గురువారం నలుగురు వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు పంపించింది. కేప్‌ కానవెరాల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి వీరున్న స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇంధన వ్యవస్థ లీకేజీ కారణంగా మూడు వారాలు ఆలస్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి జెస్సికా వాట్కిన్స్‌ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఐఎస్‌ఎస్‌లోకి ఆమె వెళ్లడం ఇది రెండోసారి. అదేవిధంగా, కక్ష్యలోకి వెళ్లే వ్యోమగాములకు నల్లజాతి మహిళ కమాండర్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి. ఈ నలుగురూ ఆరు నెలలపాటు ఐఎస్‌ఎస్‌లో గడుపుతారు. ఇప్పటికే అక్కడున్న నలుగురు వ్యోమగాములు తిరిగి భూమిపైకి వస్తారు. వాట్కిన్స్‌ మొదటిసారి 2022లో దీర్ఘకాలంపాటు ఐఎస్‌ఎస్‌లో గడిపారు. జియాలజిస్ట్‌ అయిన వాట్కిన్స్‌కు దశాబ్దం క్రితం నాసా చేపట్టిన క్యూరియాసిటీ రోవర్‌ కార్యక్రమంతోనూ సంబంధముంది. ఈమె సారథ్యంలో గురువారం వెళ్లిన వారిలో రిటైర్డ్‌ మెరైన్‌ ల్యూక్‌ డెలానీ, కెనడాకు చెందిన ఆర్మీ అధికారి జోషువా కుట్రిక్, రష్యా వాసి సెర్గీ టటెర్యాట్నికోవ్‌ ఉన్నారు. 

ఇదీ చదవండి: 12 ఏళ్ల కొడుకు గొంతు నులిమి? కష్టాల్లో ప్రముఖ నటి

కాగా, నాసా కోసం స్పేస్‌ ఎక్స్‌ చేపట్టిన 13వ మిషన్‌ ఇది. వాట్కిన్, ఆమె బృందం లక్కీ 13 అనే నంబర్‌ ప్లేట్లు కలిగిన నల్ల టెస్లా కారులో లాంఛ్‌పాండ్‌ వద్దకు చేరుకున్నారు. వ్యోమగాముల్లో కెనడాకు చెందిన కుట్రిక్‌ భార్య హీథర్‌ నవంబర్‌లో మూడో బిడ్డకు జన్మనివ్వ నున్నారు. ఆ సమయానికి కుట్రిక్‌ తన కుటుంబం నుంచి దూరంగా ఉంటారు. అందుకే, కుట్రిక్‌ ఐఎస్‌ఎస్‌ నుంచే భార్యతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఇలా, అంతరిక్షంలో ఉండగానే తండ్రవుతున్న వ్యోమగాముల్లో కుట్రిక్‌ నాలుగో వ్యక్తిగా నిలుస్తారు.   

ఇదీ చదవండి: చాలా భయపడిపోయా.. స్మిట్‌ మచ్చార్‌ భార్య ఎమోషనల్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)