Breaking News

చంద్రయాన్‌-3పై ఎలన్‌ మస్క్‌ రియాక్షన్‌

Published on Wed, 08/23/2023 - 16:36

చంద్రయాన్‌-3పై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నవేళ.. ప్రపంచ అపరకుబేరుడు ఎలన్‌ మస్క్‌ స్పందించారు. చంద్రయాన్‌-3 బడ్జెట్‌.. హాలీవుడ్‌ ఇంట‌ర్‌స్టెల్లార్ చిత్రం బడ్జెట్‌ కంటే తక్కువనే ఓ నెటిజన్‌ ట్వీట్‌కు ఎక్స్‌(ట్విటర్‌)లో మస్క్‌ బదులిచ్చారు. ఎలన్‌ మస్క్‌ సైతం స్పేస్‌ఎక్స్‌ అనే స్పేస్‌ సంస్థకు యాజమాని అనే సంగతి తెలిసిందే.

దాదాపు ఏడు వంద‌ల కోట్ల ఖ‌ర్చుతో(75 మిలియన్ల డాలర్ల) చంద్ర‌యాన్‌-3 ప్రాజెక్టును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఆ మిష‌న్ కోసం ఖ‌ర్చు చేసిన బ‌డ్జెట్‌ను ఓ నెటిజెన్ హాలీవుడ్ సినిమాతో పోల్చాడు. ఇంట‌ర్‌స్టెల్లార్ సినిమా బ‌డ్జెట్ క‌న్నా త‌క్కువ ఖ‌ర్చుతో చంద్ర‌యాన్‌-3 మిష‌న్‌ను చేప‌ట్టిన‌ట్లు ఓ నెటిజ‌న్ అన్నాడు. ఇదే చంద్రయాన్‌ ప్రయోగాన్ని ఆమధ్య ఓ నెటిజెన్ ప్రభాస్‌ ఆదిపురుష్ బ‌డ్జెట్‌తో పోల్చిన సంగతి తెలిసిందే. ఇంట‌ర్‌స్టెల్లార్ చిత్ర నిర్మాణం కోసం దాదాపు 1200 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇక ఆదిపురుష్ కోసం 700 కోట్లు ఖ‌ర్చు అయిన‌ట్లు అంచనా.

అయితే లోబడ్జెట్‌ చంద్రయాన్‌పై మస్క్‌ మాత్రం ఇది మంచి ప‌రిణామ‌మే అన్న‌ట్లుగా ఆయ‌న రియాక్ట్ అయ్యారు. గుడ్ ఫ‌ర్ ఇండియా అంటూ ఓ నెటిజ‌న్ పోస్టుకు ఆయ‌న కామెంట్ జోడించారు. ఇక స్పేస్‌ఎక్స్‌ ద్వారా అంతరిక్ష టూరిజంలో క్రియాశీలకంగా ఉన్న ఎలన్‌ మస్క్‌..  అంగారకుడితో పాటు చంద్రుడిపైకి మనిషిని పంపాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)