దక్షిణ కొరియాలో బిగ్‌‌ ట్విస్ట్‌.. ఎమర్జెన్సీ ఉపసంహరణ

Published on Wed, 12/04/2024 - 07:04

సియోల్‌: దక్షిణ కొరియాలో రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమర్జెన్సీ విధించిన కొన్ని గంటల్లో దాన్ని ఉపసంహరించుకున్నట్టు మరో ప్రకటన చేశారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌. దీంతో, ఎమర్జెన్సీ ప్రకటించిన ఆరు గంట్లలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.

స్థానిక కాలమానం ప్రకారం తెల్లావారుజామున 4:30 గంటలను అధ్యక్షుడు యూన్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘అత్యవసర పరిస్థితిని ఎత్తివేయాలని జాతీయ అసెంబ్లీ నుండి డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాము. మార్షల్ లా కార్యకలాపాల కోసం జాతీయ అసెంబ్లీ అభ్యర్థనను అంగీకరిస్తాము. కేబినెట్ సమావేశం ద్వారా ఎమర్జెన్సీని ఎత్తివేస్తాము అని ప్రకటించారు.

అంతకుముందు.. అధ్యక్షుడి నిర్ణయాన్ని ఖండిస్తూ జాతీయ అసెంబ్లీ అర్ధరాత్రి సెషన్‌లో దక్షిణ కొరియా ఎంపీలు మార్షల్ లా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా ఓటు వేశారు. 300 మంది చట్ట సభ్యుల్లో అధికార, ప్రతిపక్ష నేతలు 190 మంది ఎమర్జెన్సీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో, నాటకీయ పరిణామాల మధ్య ఎమర్జెన్సీని ఉపసంహరించుకుంటున్నట్టు అధ్యక్షుడు తెలిపారు. 

ఈ క్రమంలో, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే అభిశంసనను ఎదుర్కోవాలని డెమోక్రటిక్‌ పార్టీ సవాల్‌ చేసింది. మరోవైపు.. దక్షిణ కొరియాలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్న అమెరికా పేర్కొంది. 
 

ఎమర్జెన్సీ విధించిన అనంతరం.. దకక్షిణ కొరియాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష నేతలను ఆర్మీ.. అరెస్ట్‌ ప్రయత్నం చేసింది. దీంతో, తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. ఇక, దాదాపు ఐదు దశాబ్దాలలో దక్షిణ కొరియా ఎమర్జన్సీని విధించడం ఇదే మొదటిసారి. కొరియాలో చివరిసారిగా 1980లో ఎమర్జెన్సీ లాను ప్రయోగించారు.

 ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దేశంలో సైనిక పాలన విధిస్తూ ప్రకటన చేశారు. టీవీ చానెల్‌ ద్వారా ఈ ప్రకటన చేసిన యూన్‌.. ఉత్తర కొరియా దాడుల భయం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు దేశానికి ద్రోహం చేశాయి. ఉత్తర కొరియాతో అవి చేతులు కలిపాయి. ఆ దేశం కోసమే  పని చేస్తున్నాయవి.  గత కొంతకాలంగా పార్లమెంట్‌ను విపక్షాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తమ కుట్రలో భాగంగానే ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశ భద్రత కోసమే అత్యవసర సైనిక పాలన నిర్ణయం అని ప్రకటించారు.

పార్లమెంట్‌ వద్ద ఉద్రిక్తత
సైనిక పాలన విధింపు ప్రకటనను వ్యతిరేకిస్తూ చట్ట సభ్యులు, భారీ ఎత్తున జనం పార్లమెంట్‌ వద్ద గుమిగూడారు. వాళ్లను లోపలికి వెళ్లనివ్వకుండా భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయి. 2022లో పీపుల్‌ పవర్‌ పార్టీ తరఫున యూన్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షాల వైఖరితో ఆయన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది కోసం బడ్జెట్‌ రూపకల్పన విషయంలో ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్‌ పార్టీని ఏకతాటిపైకి తెచ్చుకోలేకపోతున్నారు. ఇంకోవైపు.. అధ్యక్షుడి భార్య, ఆయన పేషీలో ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణకు ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి.

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)