Breaking News

ద.కొరియా అధ్యక్షుడి అరెస్ట్‌

Published on Wed, 01/15/2025 - 08:09

సియోల్‌: ప్రజాపాలనకు వ్యతిరేకంగా డిసెంబర్‌లో అత్యయిక స్థితి(మార్షల్‌ లా) విధించిన దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ను దర్యాప్తు అధికారులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. దీంతో కొద్దిరోజులుగా యూన్‌ అరెస్ట్‌ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అధ్యక్ష కార్యాలయం భద్రతా సిబ్బంది నుంచి తొలుత తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురైనా సరే దర్యాప్తు అధికారులు చిట్టచివరకు అధ్యక్షభవనం లోపలికి వెళ్లి యూన్‌ను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. 

తొలుత బుధవారం తెల్లవారుజామున అవినీతినిరోధక దర్యాప్తు అధికారులు, పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెంట్రల్‌సియోల్‌లోని అధ్యక్షుడి నివాస భవనానికి చేరుకున్నారు. వీరి రాకను ముందే పసిగట్టిన అధ్యక్షుడి భద్రతాబలగాలు ముందువైపు బస్సులను, చుట్టూతా బ్యారికేడ్లను, ముళ్ల కంచెలను ఏర్పాటుచేశాయి. తొలుత బస్సులను దర్యాప్తు అధికారులు నిచ్చెనల సాయంతో ఎక్కి వాటిని దాచేశారు. తర్వాత గోడలను ఇలాగే నిచ్చెనల సాయంతో ఎక్కిదిగారు. 

అడ్డుగా ఉంచిన పెద్ద బ్యారికేడ్లనూ ఇలాగే దాటేశారు. తర్వాత ముళ్ల కంచెలను కత్తిరించి ముందుకుసాగారు. ఇలా దాదాపు 1,000 మందితో కూడిన బృందం ముందుకు దూసుకువచ్చినా భద్రతాబలగాలు అడ్డుపడి ఈ బృందాన్ని ముందుకెళ్లకుండా నిలువరించాయి. దీంతో అధ్యక్షభవన బలగాలకు, దర్యాప్తు బలగాలకు మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగింది. ఎట్టకేలకు దర్యాప్తు బృందం ఎలాగోలా నివాసంలో లోపలికి వెళ్లి అధ్యక్షుడిని అరెస్ట్‌చేసింది. 

ముందు జాగ్రత్తగా ఇంకో దర్యాప్తు బృందం అధ్యక్షభవనం వెనుక వైపు ఉన్న ఎత్తయిన ప్రదేశాన్ని ట్రెక్కింగ్‌త రహాలో ఎక్కి వచ్చింది. మార్షల్‌లా కారణంగా దేశంలో అస్థిరతకు కార ణమయ్యారంటూ యూన్‌పై విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టి నెగ్గించుకోవడం తెల్సిందే. అభిశంసన నేపథ్యంలో ఆయన తన అధికారాలను కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత ఎన్నికైన తాత్కాలిక అధ్యక్షుడినీ విపక్షాలు అభిశంసించాయి. 

 

మార్షల్‌ లా విధించడానికి గల కారణాలపై సంజాయిషీ ఇచ్చుకునేందుకు దర్యాప్తు అధికారులు యూన్‌కు అవకాశం ఇవ్వడం ఆయన స్పందించకపోవడంతో అరెస్ట్‌కు కోర్టు నుంచి గతంలోనే అనుమతి తెచ్చుకున్నారు. ఇటీవల అరెస్ట్‌కు ప్రయత్నించి విఫలమైన దర్యాప్తు అధికారులు బుధవారం మరోసారి ప్రయత్నించి సఫలమయ్యారు. ‘‘ చట్టబద్ధపాలన దేశంలో కుప్పకూలింది’’ అని అరెస్ట్‌కు ముందు రికార్డ్‌ చేసిన ఒక వీడియో సందేశంలో అధ్యక్షుడు యూన్‌ వ్యాఖ్యానించారు. 

 

సౌత్ కొరియా అధ్యక్షుడు అరెస్ట్

 


 పదవిలో ఉండి అరెస్ట్‌ అయిన తొలి దక్షిణకొరియా అధ్యక్షుడిగా యూన్‌ చరిత్రలో నిలిచిపోయారు. వచ్చే కొన్ని వారాలపాటు ఆయన కస్టడీలనే ఉండిపోనున్నారు. దేశంలో తిరుగుబాటు తెచ్చేందుకు ప్రయత్నించారన్న అభియోగాలపై ఆయనను అరెస్ట్‌చేయదలిస్తే 48 గంటల్లోపు ఆమేరకు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలి. లేదంటే ఆయనను మళ్లీ విడుదలచేయాల్సి ఉంటుంది. ఒకవేళ సాధారణ అరెస్ట్‌గా ఆయనను అదుపులోకి తీసుకుని ఉంటే నేరాభియోగాలు మోపేలోపు మరో 20 రోజులపాటు ఆయనను తమ కస్టడీలోనే ఉంచుకోవచ్చు. ఆయన అరెస్ట్‌ను ఆయన తరఫు లాయర్లు తప్పుబట్టారు. దేశద్రోహం సెక్షన్ల కింద నమోదైన కేసులను అవినీతినిరోధక శాఖ అధికారులు దర్యాప్తు చేయలేరని, అరెస్ట్‌ అన్యాయమని వాదించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)