దక్షిణ కొరియాలో ‘మార్షల్‌ లా’ అంశం.. మాజీ రక్షణ మంత్రి అరెస్ట్‌

Published on Sun, 12/08/2024 - 08:09

సియోల్‌: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కు దేశంలో ఎమర్జెన్సీ విధించాలంటూ సిఫారసు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ రక్షణ మంత్రి కిమ్‌ యోంగ్‌ హ్యూన్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఆయన్ను ప్రశ్నించిన అధికారులు గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, కిమ్‌ తనకుతానుగానే సియోల్‌ విచారణాధికారి కార్యాలయానికి వెళ్లారని, ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు అరెస్ట్‌ చేశారని మీడియా అంటోంది. కిమ్‌ కార్యాలయంతోపాటు నివాసంలోనూ తనిఖీలు చేపట్టారని చెబుతున్నారు. 

ఎమర్జెన్సీ విధింపునకు దారి తీసిన పరిస్థితులపై కిమ్‌పై విచారణ కోసం 62 మంది సభ్యుల దర్యాప్తు బృందం ఏర్పాటైందని సీనియర్‌ ప్రాసిక్యూటర్‌ పార్క్‌ సె–హ్యూన్‌ వెల్లడించారు. గత వారం స్వల్ప కాల ఎమర్జెన్సీని, ఆ తర్వాత పార్లమెంట్‌ తొలగించడం తెలిసిందే. ఈ పరిణామానికి సంబంధించిన తొలి అరెస్ట్‌ ఇది. అధ్యక్షుడు యూన్‌పై శనివారం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అధికార పక్ష సభ్యుల గైర్హాజరుతో వీగిపోయింది. అయినప్పటికీ, త్వరలోనే మరోసారి అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షాలు అంటున్నాయి. మొత్తం పరిణామాలకు కేంద్ర బిందువుగా భావిస్తున్న కిమ్‌ మంత్రి పదవికి గురువారమే రాజీనామా చేశారు.

ఇదీ చదవండి: దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఉపశమనం

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)