దక్షిణాఫ్రికాలో కాల్పులు.. 10 మంది మృతి

Published on Sun, 12/21/2025 - 11:45

దక్షిణాఫ్రికాలో మళ్లీ తూటా పేలింది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఆగంతకులు జరిపిన కాల్పుల్లో పది మంది మరణించారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. 

ఆదివారం జొహన్నెస్‌బర్గ్‌ శివారులోని బెకర్స్‌డాల్‌ టౌన్‌షిప్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కాల్పుల ఘటన తర్వాత ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమస్యాత్మక ప్రాంతం కావడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని అధికారులు అంటున్నారు. 

దక్షిణాఫ్రికాలో కఠినమైన ఆయుధ చట్టం అమల్లో ఉంది. ఫైర్‌ఆర్మ్స్‌ కంట్రోల్‌ యాక్ట్‌ 2000 ప్రకారం.. గన్‌ లైసెన్స్ పొందడానికి కంపిటెన్సీ టెస్ట్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, పోలీసుల అనుమతి తప్పనిసరి. అలాగే ఆయుధాన్ని భద్రంగా ఉంచే చోటును కూడా పరిశీలిస్తారు. అయినప్పటికీ గన్‌ కల్చర్‌ ఆ దేశంలో పెద్ద సమస్యగా మారింది. సామూహిక కాల్పుల ఘటనలు తరచూ చోటు చేసుకుంటన్నాయి. 

దక్షిణాఫ్రికాలో నెల వ్యవధిలో జరిగిన సామూహిక కాల్పుల ఘటన ఇది (Mass Shooting In South Africa). ఈ నెల 6న ప్రిటోరియా సమీపంలో అక్రమంగా మద్యం అమ్మే చోట దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారితో సహా 12 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)