Breaking News

ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ జెండా ఎగురవేసినందుకు.. కన్న కొడుకునే హత్య

Published on Tue, 01/23/2024 - 15:24

పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికల ముందు ఓ కుటుంబంలో పార్టీ జెండా చిచ్చు పెట్టింది.  ఆ చిచ్చు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తనకు నచ్చని పార్టీకి సంబంధించిన జెండాను ఇంటిపై ఎగురువేసినందుకు ఓ తండ్రి తన కన్న కొడుకునే హతమార్చాడు. ఈ ఘటన పాకిస్తాన్‌ ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్ శివార్లలో ఉన్న ఓ కుటుంబంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెషావర్‌ శివార్లలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తండ్రి ఎంత వద్దని చెప్పినా కొడుకు తనకు నచ్చిన పాక్‌ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీకి చెందిన జెండాను ఇంటిపై ఎగురవేశాడు. దీంతో తండ్రీ కొడుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన తండ్రి తుపాకితో కొడుకును కాల్చాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయిన ఫలితం లేదు. మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కొడుకును చంపిన తండ్రి పారారీలో ఉన్నారుని చెప్పారు. కొడుకును హత్య చేసిన తండ్రి కోసం వెతుకుతున్నామని పోలీసు అధికారి నసీర్ ఫరీద్ మీడియాకు వెల్లడించారు

చదవండి:  భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)