Breaking News

వందేళ్ల యుద్ధ సైనికుని వివాహం.. హాజరైన బైడెన్‌

Published on Mon, 06/10/2024 - 07:08

రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికా మాజీ సైనికుడు హెరాల్డ్ టెరెన్స్  తన 100 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ వివాహానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

దేశాధినేతలైన బైడెన్‌, మాక్రాన్‌లు కొత్తగా పెళ్లయిన హెరాల్డ్ టెరెన్స్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి వివాహం ఫ్రాన్స్, అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. హెరాల్డ్ పెళ్లి చేసుకున్న ప్రియురాలికి 96 ఏళ్లు. ఆమె పేరు జీన్ స్వెర్లిన్. వారిద్దరూ ఫ్రాన్స్‌లోని నార్మాండీలోని డి-డే బీచ్‌లలో ఉన్న టౌన్ హాల్‌లో వివాహం చేసుకున్నారు. 1944 జూన్ 6న అడాల్ఫ్ హిట్లర్ దౌర్జన్యాల నుండి ఐరోపాను విముక్తి చేయడానికి మిత్రరాజ్యాల విమానాలు ఇక్కడే ల్యాండ్‌  అయ్యాయి. అనంతరం ఇక్కడ భీకర యుద్ధం జరిగింది.

హెరాల్డ్ తన పెళ్లికి రెండవ ప్రపంచ యుద్ధంలో తాను పోరాడిన ప్రదేశాన్నే ఎంచుకున్నారు. వీరి వివాహానికి హాజరైన కొందరు రెండవ ప్రపంచ యుద్ధం నాటి దుస్తులు ధరించారు. జీన్ స్వెర్లిన్ గులాబీ రంగు దుస్తులు ధరించగా, టెరెన్స్ లేత నీలం రంగు సూట్ ధరించారు. ఈ సందర్భంగా టెరెన్స్ మాట్లాడుతూ  తన పెళ్లి రోజు తన జీవితంలోని ఉత్తమమైన రోజు అని, ప్రేమ అనేది కేవలం యువతీయువకులకు సంబంధించినది మాత్రమే కాదని పేర్కొన్నాడు. వీరి వివాహ విందు ఎలీసీ ప్యాలెస్‌లో జరిగింది. 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)