Breaking News

Snap Elections: జపాన్ పార్లమెంట్‌ రద్దు

Published on Wed, 10/09/2024 - 14:22

జపాన్‌ పార్లమెంటు రద్దు అయింది. ముందస్తు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పార్లమెంటును రద్దు చేసినట్లు ఆ దేశ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ప్రకటించారు. దశాబ్ద కాలంగా జపాన్‌ను అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ పరిపాలిస్తోంది. ఈ సందర్భంగా   ప్రధాని షిగేరు ఇషిబా మాట్లాడారు. 

‘‘మేము ఈ ఎన్నికలను న్యాయంగా, నిజాయితీగా ఎదుర్కోవాలనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం  ప్రజల విశ్వాసాన్ని పొందాలని కోరుకుంటుంది’’ అని అన్నారు. అయితే.. జపాన్‌లో జనాభా సంక్షోభం నెలకొన్న పేద ప్రాంతాలపై రక్షణ, అటువంటి ప్రాంతాలపై మరిన్ని అధిక నిధులు ఖర్చు చేయటం వంటి విధానాల అమలకు ప్రజల మద్దతును ప్రధాని ఇషిబా కోరుకుంటున్నట్లు తెలిస్తోంది.
 

 

పలువురు కీలక నేతలు పార్టీ మారుతున్నా కూడా ఎలాంటి ఢోకా లేకుండా లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ పాలన కొనసాగిస్తోంది. ఇక.. వారం రోజుల కిందటే నూతన ప్రధానిగా షిగేరు ఇషిబా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇంతలోనే ముందస్తు ఎన్నికల కోసం పార్లమెంట్‌ను రద్దు చేయటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక.. అక్టోబర్ 27న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి.

చదవండి: ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్‌ నోబెల్‌

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)