Breaking News

ప్రపంచాన్ని వణికిస్తున్న దోమలు

Published on Tue, 08/20/2024 - 08:26

ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు 20న నిర్వహిస్తుంటారు. ఈ రోజున దోమల కారణంగా వచ్చే వ్యాధులపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటాయి. ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తుంటారు.

వర్షాకాలంలో దోమల బెడద విపరీతంగా ఉంటుంది. ఇదే సమయంలో దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, జికా వైరస్‌ తదితర వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో దోమకాటు కారణంగా లక్షల మంది అనారోగ్యానికి గురవుతుంటారు. అందుకే ఇటువంటి సమయంలో ప్రజలు  ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు.

దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల నివారణకు సంబంధించిన ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. దోమల కారణంగా మలేరియా వ్యాపిస్తుందని 1897లో శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారు. ప్రపంచ దోమల దినోత్సవాన్ని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రారంభించింది. ప్రపంచ దోమల దినోత్సవం- 2024ను ‘మరింత మెరుగైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని తీవ్రతరం చేయడం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.

దోమల నివారణకు కలుషితమైన నీటి వినియోగాన్ని నివారించాలి. దోమలు తేమగా ఉండే ప్రదేశాలలోను, నీరు నిలిచే ప్రదేశాలలోను త్వరగా వృద్ధి చెందుతాయి. అందుకే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు దోమ తెరలు లాంటివి వినియోగించడం ఉత్తమం.

వర్షాకాలంలో దోమల్ని తరిమికొట్టే చిట్కాలు 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)