Breaking News

నరహంతకుడు చచ్చాడు..ఇపుడు ఊపిరి పీల్చుకుంటున్నా!

Published on Sat, 10/28/2023 - 10:53

అమెరికాలోని  మైనేలో కాల్పులతో  విధ్వంసం సృష్టించిన నిందితుడు శవమై తేలాడు.  మైనేలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో 16 మందిని పొట్టనపెట్టుకున్న నిందితుడు బౌడోయిన్‌కు చెందిన రాబర్ట్ కార్డ్ (40) తుపాకీతో తననుతాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా పోలీసులు, FBI ఏజెంట్లు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే అతని మృతదేహాన్ని గుర్తించారు. 

కార్డ్ మృతదేహం లూయిస్టన్‌కు ఆగ్నేయంగా ఉన్న లిస్బన్ ఫాల్స్‌లో రీసైక్లింగ్ సెంటర్‌కు సమీపంలో  గుర్తించామని  మైనే పబ్లిక్ సేఫ్టీ కమీషనర్ మైక్ సౌషుక్ తెలిపారు. రిటైర్డ్‌ మిలిటరీ ఆఫీసర్‌ అయిన కార్డ్‌ ఇంతకు ముందు పనిచేసిన చోట ఉద్యోగం కోల్పోయినట్టు  తెలుస్తోందన్నారు. అతను మానసికసమస్యలకు చికిత్స  పొందుతున్నట్టు సమాచారం ఉందని తెలిపారు. అలాగే కార్డ్‌కు చెందిన  తెల్ల ఎస్‌యూవీ కారును  స్వాధీనం చేసుకున్నామని  వెల్లడించారు. 

అటు  ఈ  ఘటనపై గవర్నర్ జానెట్ మిల్లిస్ మాట్లాడుతూ ఆ దుర్మార్గుడు మరణంతో చాలా ఇకపై ఎవరికి ముప్పు లేదని తెలిసి చాలా ఊరటగా ఉంది...కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నానని మిల్లిస్ ఒక వార్తా సమావేశంలో ప్రకటించారు. 

కాగా  బుధవారం (అ‍క్టోబరు 25) రాత్రి మైనేలోని లెవిస్టన్‌లోని బౌలింగ్ అల్లే, రెస్టారెంట్‌లో రాబర్ట్‌ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 16 మందిని  చని పోయారు.  వీరిలో  70 ఏళ్ల భార్యాభర్తలు, తండ్రితో పాటు హత్యకు గురైన 14 ఏళ్ల బాలుడి వరకు బాధితులను అధికారులు శుక్రవారం గుర్తించారు. ఈ ఘటనలో మరో 50-60 మంది దాకా గాయ పడిన సంగతి తెలిసిందే.

2017లో లాస్ వెగాస్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో 60 మంది మరణించిన  ఘటన, అలాగే 2022లో టెక్సాస్‌లోని ఉవాల్డేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ముష్కరుడు కాల్పులు జరిపి, 19 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులను చంపిన ఘటన తరువాత ఇదే అత్యంత ఘోరమైన కాల్పులు కావడంతో  ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)