Breaking News

లిఫ్ట్‌లో శశిథరూర్ విలవిల..

Published on Sat, 07/18/2026 - 07:43

తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శుక్రవారం సాయంత్రం తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో లిఫ్ట్‌లో చిక్కుకుని భయాందోళనకు గురయ్యారు. పీఎంజీ ప్రాంతంలోని హోటల్ ప్రశాంత్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సాయంత్రం 6 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు. ఆరో అంతస్తులో ఉండగా లిఫ్ట్ ఒక్కసారిగా మొరాయించడంతో థరూర్‌తో పాటు ఆయన బృందం సభ్యులు సుమారు 15 నిమిషాల పాటు లోపలే ఉండిపోయారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన హోటల్‌కు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బయటి నుంచి లిఫ్ట్ తలుపులను తెరిచి థరూర్‌ను, ఆయన వెంట ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. లిఫ్ట్ లోడ్ ఎక్కువగా ఉండటం వల్లే సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
 

ఘటన అనంతరం థరూర్ మాట్లాడుతూ.. తాము అందరం సురక్షితంగా ఉన్నామని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ‘ముందుగా నేను లిఫ్ట్ నిర్వహణ సిబ్బందికి, ఆ తర్వాత హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించాను. వారు విఫలం కావడంతో చివరికి ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ వారికి కాల్ చేశాం’ అని పేర్కొన్నారు. తక్షణమే స్పందించి ప్రాణాపాయం నుంచి తప్పించిన అగ్నిమాపక సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి: ప్రపంచం మెచ్చిన పాట.. సింగర్‌కు దక్కింది ఇంతేనా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)