Breaking News

USA: న్యూ ఇయర్‌ వేళ ఉగ్రదాడి.. 15కు చేరిన మరణాలు

Published on Thu, 01/02/2025 - 08:03

వాషింగ్టన్‌: కొత్త ఏడాది వేడుకల వేళ అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోయిన జనంపైకి ఓ ఆగంతకుడు ట్రక్కుతో ఢీకొట్టి, తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 15 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఇందుకు కారణమైన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపడంతో అతడు చనిపోయాడు.  ఘటనపై ఉగ్ర చర్య కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోంది.

ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐ కీలక ప్రకటన చేసింది. న్యూ ఆర్లీన్స్‌లో పికప్‌ ట్రక్‌తో బీభత్సం సృష్టించిన నిందితుడిని షంషుద్దీన్‌ జబ్బార్‌(42)గా ఎఫ్‌బీఐ గుర్తించింది. అతడు అమెరికా పౌరుడే. టెక్సాస్‌లో రియల్‌ ఎస్టేట్ ఏజెంట్‌గా జబ్బార్‌ పనిచేస్తున్నాడు. ఏడేళ్లు మిలిటరీలోనూ సేవలు అందించాడు. అయితే, ఆర్థిక కారణాలు ఎదుర్కొంటున్న జబ్బార్‌కు భార్యతో విడాకులు అయ్యాయి. కాగా, ప్రమాదం తర్వాత అతడి వాహనంలో ఐసీస్‌ ఉగ్రవాద సంస్థ జెండా లభించింది. దీంతో, ఈ ఘటన టెర్రరిస్ట్‌ల పన్నాగమేనని ఎఫ్‌బీఐ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూఆర్లీన్స్‌లోని బార్బన్‌ వీధి కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాదిలాగే ఈసారీ వేల మంది ఈ వేడుకల కోసం తరలివచ్చారు. దీంతోపాటు బుధవారం సాయంత్రం సమీపంలోని స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఉండటంతో మరింత మంది ఈ ప్రాంతానికి ముందుగానే వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3.15 సమయంలో వారంతా సంబరాల కోసం రోడ్డుపై ఉండగా దుండగుడు వాహనంతో వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా.. మరో 35 మంది గాయపడ్డారు. దాడి అనంతరం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో, పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో జబ్బార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

 బైడెన్‌ సంతాపం..
ఈ ఘటనపై ఉగ్ర కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ప్రతి అంశాన్నీ పరిశీలించి ఏం జరిగిందో తెలుసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించానని పేర్కొన్నారు. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి వచ్చిన వారు విగత జీవులుగా మారడంతో తన హృదయం బరువెక్కిపోయిందని వెల్లడించారు. ఎటువంటి హింసనూ సహించేది లేదని స్పష్టం చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)