Breaking News

శీతాకాల తుపాను తీవ్రం.. అమెరికా హై అలర్ట్‌

Published on Sun, 01/05/2025 - 12:09

అగ్రరాజ్యం అమెరికాను శీతాకాల తుపాను భయకంపితులను చేస్తోంది. సుమారు పది లక్షల మంది అమెరికన్లు భారీ శీతాకాలపు తుఫానుకు ప్రభావితమయ్యారు. ఈ తుపాను కారణంగా ఈ దశాబ్దంలో అత్యంత భారీ హిమపాతం, అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

మధ్యఅమెరికాను తాకిన ఈ తుఫాను మరో రెండు రోజుల్లో తూర్పు దిశగా కదులుతుందని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యుఎస్) తెలిపింది. ఈ నేపధ్యంలో కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి(Emergency) ప్రకటించారు. మిసిసిపీ, ఫ్లోరిడాతో సహా ప్రాంతాల్లో తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయి. ఈ తుపాను కారణంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు ముప్పు పొంచివుందని ఎన్‌డబ్ల్యుఎస్ పేర్కొంది.

ఆర్కిటిక్ చుట్టూ ప్రసరించే చల్లటి గాలితో కూడిన పోలార్ వోర్టెక్స్(Polar Vortex) వల్ల ఈ విపరీత వాతావరణం ఏర్పడుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దశాబ్దంలో సంభవించిన అత్యంత భారీ హిమపాతం ఇదేనని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఇది 2011  తరువాత అమెరికాలో అత్యంత శీతల జనవరిగా పేర్కొంది. చారిత్రక సగటు కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు ఒక వారం పాటు కొనసాగనున్నాయని పేర్కొంది. ఆదివారం సాయంత్రానికి తుఫాను వచ్చే అవకాశం ఉన్న తూర్పు తీరంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి.

ఎన్‌డబ్ల్యుఎస్ తెలిపిన వివరాల ప్రకారం సెంట్రల్ అమెరికాలో ఆదివారం తుపాను కారణంగా జనజీవనానికి ఆటంకాలు ఏర్పాడతాయి. పలు చోట్లు రోడ్లను మూసివేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాన్సాస్, ఇండియానా(Indiana)లోని కొన్ని ప్రాంతాల్లో కనీసం 8 ఇంచుల మేరకు మంచు కురిసే అవకాశాలున్నాయి. మిడ్‌వెస్ట్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంచు తుఫానులు తలెత్తే అవకాశం ఉంది. మిస్సౌరీ, ఇల్లినాయిస్, కెంటుకీ, వెస్ట్ వర్జీనియా ప్రాంతాలలో  భారీగా మంచు కురిసే అవకాశం ఉంది.

ఇది కూడా చూడండి: కాశీలోనూ కుంభమేళా ఉత్సాహం.. పోటెత్తనున్న భక్తులు

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)