Breaking News

పాక్‌లో రైలు ప్రమాదం.. 30 మందికి గాయాలు

Published on Sat, 08/02/2025 - 07:50

లాహోర్: పాకిస్తాన్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లాహోర్ సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లాహోర్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

పాకిస్తాన్ రైల్వేలు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం లాహోర్ నుండి రావల్పిండికి వెళ్తున్న ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్..  షేక్‌పురాలోని కాలా షా కాకు వద్ద పట్టాలు తప్పింది. రైలులోని 10 బోగీలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి.
 

ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. లాహోర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన అరగంటకు రైలు బోగీలు పట్టాలు తప్పాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే మంత్రి ముహమ్మద్ హనీఫ్ అబ్బాసి వెంటనే రైల్వే సీఈఓ, డివిజనల్ సూపరింటెండెంట్‌ను అప్రమత్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి ఏడు రోజుల్లోగా విచారణ ఫలితాలను సమర్పించాలని ఆదేశించారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)