Breaking News

బ్లింకెన్‌ ‘కొత్త ఒప్పంద’ వ్యాఖ్యలపై హమాస్‌ విమర్శలు

Published on Tue, 08/20/2024 - 09:45

గాజా కాల్పుల విరమణ ఒప్పంద చర్చలపై అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చేసిన వ్యాఖ్యపై హమాస్‌ విమర్శలు చేసింది. ఆయన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవని పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నవీకరించిన ఒప్పంద ప్రతిపాదనను ఆమోదించారని ఆంటోని బ్లింకెన్‌ చేసిన వాఖ్యలపై హమాస్‌ సీనియర్ అధికారి ఒసామా హమ్దాన్ స్పందించారు.

‘నవీకరించిన గాజా  కాల్పుల విరమణ  ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు  చెప్పటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ ఒప్పందం మాకు సమర్పించింది (లేదా) అంగీకరించినది కాదు. మాకు కొత్త గాజా కాల్పుల విరమణ చర్చలు అవసరం లేదు. అమలు యంత్రాంగాన్ని మేము అంగీకరించము’అని అన్నారు.

సోమవారం బ్లింకెన్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో సమావేశమయ్యారు. నెతన్యాహుతో సమావేశం అనంతరం.. ‘ఇది చాలా కీలమైన దశ..  ఒప్పందానికి ఆఖరి అత్యుత్తమ అవకాశం.  అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి నెతన్యాహు మద్దతు తెలిపారు. హమాస్‌ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించాలి. కొత్త గాజా  కాల్పుల విరమణ  ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు నెతన్యాహు చెప్పారు’అని అన్నారు.

అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ల మధ్యవర్తిత్వంతో గురువారం ప్రారంభమైన గాజా కాల్పుల విరమణ చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే శుక్రవారం ముగిసిన విషయం తెలిసిందే. ఈ వారంలో మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)