Breaking News

కంపు చేస్తున్నాయని.. భారత్‌కు తరలిస్తున్నారు

Published on Tue, 03/07/2023 - 13:13

ఒకప్పుడు వాటి సంఖ్య నాలుగు మాత్రమే. ఇప్పడు ఆ కౌంట్‌ 130కి చేరింది. పెరిగితే పెరిగాయ్‌. కానీ, ఆ ప్రాంతమంతా కంపు కంపు చేస్తున్నాయి. అందుకే వాటిని వదిలించుకునేందుకు అధికారులు, ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించాయి. ఇక చివరి ప్రయత్నంగా వాటిని భారత్‌కు తరలించేందుకు సిద్ధం అయ్యాయి. 

కొలంబియా ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. డెబ్భై  హిప్పోపోటమస్‌లను పట్టుకుని వాటిని భారత్‌తో పాటు మెక్సికోకు తరలించాలని నిర్ణయించుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే..  ఇవి డ్రగ్‌ లార్డ్‌గా పేరుగాంచిన  పాబ్లో ఎస్కోబార్‌కు చెందినవి కావడం. 

1980లో ఎస్కోబార్‌ నాలుగు హిప్పోపోటమస్‌(నీటి ఏనుగులను) ఆఫ్రికా నుంచి అక్రమంగా తెప్పించుకున్నాడు. ఆ టైంలో అతని దగ్గర ఏనుగులు, జిరాఫీలు.. ఇలా జంతువుల కలెక్షన్స్‌తో ఒక పెద్ద జూ ఉండేది. పశ్చిమ ప్రాంతంలోని తన ఎస్టేట్‌లో వీటిని ఉంచాడు.  అయితే.. 1991లో ఎస్కోబార్‌ లొంగిపోయాక.. అక్కడి ప్రభుత్వం వాటికి స్వేచ్ఛ కల్పించింది. అటుపై.. ఆ ఈ ముప్పై ఏళ్లలో ఆ నాలుగు నీటి ఏనుగుల సంఖ్య కాస్త 130కి చేరుకుంది. 

ప్రస్తుతం అవి మాగ్డలీనా నది ప్రాంతంలో ఉంటున్నాయి. అయితే.. అక్కడి నేల సారవంతాన్ని పాడు చేయడంతో పాటు, అక్కడి నీటిని కలుషితం చేస్తున్నాయి. మొక్కలను పాడు చేస్తున్నాయి. పైగా స్థానికులు సైతం వాటి వల్ల ప్రాణపాయం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో.. వాటి జనాభాను నియంత్రించేందుకు కొలంబియా ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, ఆ చర్యలు ఫలించలేదు. చేసేది లేక వాటిని చంపేందుకు కూడా అనుమతులు మంజూరు చేసింది. దీంతో తీవ్ర ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆ ఆదేశాలను వెనక్కి  తీసుకుంది. 

ఇక చివరి ప్రయత్నంగా వాటిని దూరంగా తరలించడమే మార్గమని కొలంబియా ప్రభుత్వం భావిస్తోంది. భారత్‌కు 60, మెక్సికోకు పది హిప్పోలను తరలించాలని నిర్ణయించుకుంది కొలంబియా ప్రభుత్వం. అయితే.. ఈ కొలంబియా ప్రతిపాదనపై భారత్‌ స్పందన తెలియాల్సి ఉంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)