Breaking News

సెమికోలన్‌ ఎక్కడ?.. ఎందుకు మాయమవుతోంది?

Published on Fri, 05/23/2025 - 10:47

ఆధునిక జీవనశైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆహారవిహారాదులలోనే కాకుండా, భాష వినియోగంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు విరివిగా ఉపయోగించే పదాలు ఇప్పుడు మృగ్యమవుతున్నాయి. వీటిలో వ్యాకరణ చిహ్నాలకూ మినహాయింపేమీ లేదు. ఈ జాబితాలోకే వస్తుంది సెమీ కాలన్‌(Semi-colon)(;).. ఇప్పుడిది కనుమరుగయ్యే దశకు చేరుకుందని బాషా నిపుణులు అంటున్నారు.  


ఆంగ్ల వ్యాకరణంలో సెమికోలన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది ఒక విరామ చిహ్నం. ఒకే వాక్యంలోని సారూప్యత కలిగిన రెండు అంశాలను వేరు చేయడానికి సెమికోలన్‌‌ వినియోగిస్తారు. ఉదాహరణకు ‘పొద్దున్న ఎనిమిది గంటలకు రైలు బయలుదేరుతుంది; అది 10 గంటలకు గమ్యానికి చేరుతుంది’ వీటి మధ్య కనిపిస్తున్న(;) చిహ్నమే సెమికోలన్‌. ఆంగ్ల వాక్యాలలో ఒకప్పుడు విరివిగా ఉపయోగించే ఈ చిహ్నం ఇప్పుడు కనుమరుగవుతోంది. దీనికి పలు కారణాలున్నాయి.

ఆంగ్ల భాష అభ్యాసానికి ఉపయుక్తమయ్యే సాఫ్ట్‌వేర్ బాబెల్(Software Babel) సాగించిన ఒక అధ్యయనంలోని వివరాల ప్రకారం గత రెండు దశాబ్దాలుగా, ఇంగ్లీష్ పుస్తకాలలో సెమికోలన్ వాడకం వేగంగా క్షీణిస్తూ వస్తోంది.  ఒకప్పుడు రచయితలు సెమీకోలన్‌ను స్వీకరించి, పరిపూర్ణ వాక్యాలను రూపొందించడానికి  విరివిగా ఉపయోగించారు. లియో టాల్‌స్టాయ్ రాసిన ‘అన్నా కరెనినా’లో ప్రారంభ పంక్తిలోనే సెమికోలన్‌‌ కనిపిస్తుంది. ఆంగ్ల భాషలో సెమికోలన్ అనేది దగ్గరి సంబంధం కలిగిన రెండు వాక్యాలను ఒకే వాక్యంగా లింక్ చేయడానికి సాధారణంగా ఉపయోగిస్తుంటారు.

సెమికోలన్ ఉపయోగం ఇప్పుడున్న వారిలో చాలా తక్కువమందికే తెలుసని నిపుణులు అంటున్నారు. పాఠశాలల్లోనూ దీని ప్రాధాన్యతను తగ్గించారనే వాదన వినిపిస్తోంది. విశ్వవిద్యాలయాలలో సాహిత్యాన్ని అధ్యయనం చేసే వారు కూడా సెమికోలన్‌ను గుర్తించడంలేదని అధ్యయనంలో వెల్లడయ్యింది. భారతదేశంలోని ఆంగ్ల రచయితలు కూడా ఈ వ్యాకరణ చిహ్నాన్ని అంతగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. మరోవైపు సెమికోలన్‌ను తప్పుగా వినియోగిస్తే, ఆ వాక్యం అపార్థానికి దారితీసే అవకాశం కూడా ఉంది. అందుకే పలువురు రచయితలు దీని వినియోగాన్ని విస్మరిస్తున్నారు. అయితే ఆంగ్ల నిపుణులు సెమికోలన్‌‌ వాడకాన్ని ప్రోత్సహిస్తూ, వాక్యాలలో దీనిని వినియోగించడం ద్వారా మరింత స్పష్టమైన అర్థాన్ని వ్యక్తం చేయవచ్చని చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: World Turtle Day: తోటి తాబేలు పక్కనున్నా..

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు