Breaking News

బంగ్లాలో మరో హిందువుపై దాడి.. సీమా దాస్‌ కీలక వ్యాఖ్యలు

Published on Fri, 01/02/2026 - 07:31

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులే టార్గెట్‌గా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి జరిగింది. వ్యాపారి ఖోకన్‌ చంద్ర దాస్‌పై దుండగులు దాడి చేశారు. దుండగులు.. ఆ తర్వాత పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటన దాముద్యాలోని క్యూర్‌బంగా బజార్‌లో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగింది. కాగా, గడిచిన రెండు వారాల్లో నలుగురు హిందువులపై దాడి జరగడం గమనార్హం.

ఈ నేపథ్యంలో తన భర్తపై జరిగిన హత్యాయత్నంపై దాస్‌ భార్య సీమా దాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తర్వాత సీమా దాస్‌ మీడియాతో మాట్లాడారు. పెట్రోల్‌ పోసి తన భర్తను హత్య చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. తమకు ఏ విషయంలోనూ ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవన్నారు. తన భర్తపై ఎందుకు దాడి చేశారో అర్థం కావడం లేదన్నారు. మేము హిందువులం. ఇక్కడ శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం. నా భర్తపై దాడి చేసిన వారిని ప్రభుత్వం శిక్షించాలి. దాడి చేసిన వారిలో ఇద్దరిని నా భర్త గుర్తించారు. అందుకే పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. నేను ప్రభుత్వాన్ని సాయం కోసం అభ్యర్థిస్తున్నాను అని కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం ఢాకాకు తరలించారు. కోనేశ్వర్‌ యూనియన్‌లోని తిలాయ్‌ గ్రామానికి చెందిన ఖోకన్‌ దాస్‌.. క్యూర్‌బంగా బజార్‌లో ఔషధాలు, మొబైల్‌ బ్యాంకింగ్‌ వ్యాపారం చేస్తారు. బుధవారం రాత్రి తన దుకాణాన్ని మూసివేసిన అనంతరం ఆయన ఆటోలో ఇంటికి బయలుదేరారు. క్యూర్‌బంగా బజార్‌కు సమీపంలో దుండగులు ఆయన ఆటోను ఆపారు. పదునైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారు. గాయపడిన దాస్‌ తలపై పెట్రోలు పోసి నిప్పంటించారు. 

దుండగుల నుంచి తప్పించుకోవడానికి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దాస్‌ దూకేశారు. ఈలోగా స్థానికులు అప్రమత్తమై కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. బాధితుడిని షరియత్‌పుర్‌ సదర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢాకా తీసుకెళ్లారు. ఆయన పొట్టపై, ముఖంపై, మెడ వెనుక భాగంలో, చేతులపై తీవ్ర గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. 

#

Tags : 1

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)