Breaking News

విష్ణు విగ్రహం కూల్చివేత.. థాయ్ వివరణ

Published on Thu, 12/25/2025 - 17:34

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లొ విష్ణుమూర్తి విగ్రహం కూల్చివేతపై థాయ్‌లాండ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ చర్య భద్రతా కారణాలతో కూడుకున్నదని, మతపరమైన ఉద్దేశాలు ఏవీ లేవని అధికారులు తెలిపారు.  సరిహద్దు నిర్వహణ, నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్-కంబోడియన్ సరిహద్దు ప్రెస్ సెంటర్ మీడియాకు వెల్లడించింది.

2014లో నిర్మితమైన ఈ విగ్రహాన్ని థాయ్ సైనిక సిబ్బంది బ్యాక్‌హో లోడర్‌తో కూల్చివేస్తున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఈ నిర్మాణం తమ భూభాగంలోని చోంగ్ అన్ మా ప్రాంతంలో ఉందని, సార్వభౌమత్వాన్ని తెలియజేసేందుకే కంబోడియా సైనికులు దీనిని నిర్మించారని థాయ్ అధికారులు చెబుతున్నారు. హిందూ మతంతో తమకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గౌరవిస్తామని, అయితే సరిహద్దు ఉద్రిక్తతలను పెంచే చిహ్నాలను నిరోధించడమే తమ ప్రాధాన్యతని వారు తెలిపారు.

ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. థాయిలాండ్ మరియు కంబోడియా దేశాలు రెండూ సంయమనం పాటించాలని, వివాదాలను చర్చలు మరియు దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.

మరోవైపు, కంబోడియా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ భూభాగంలోని ప్రీహ్ విహార్ ప్రావిన్స్‌లో ఉన్న విగ్రహాన్ని థాయ్ దళాలు ధ్వంసం చేశాయని ఆరోపించింది. ఈ సరిహద్దు వివాదం కారణంగా గతంలో ఘర్షణలు ఏర్పడి పలువరు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, మతపరమైన కట్టడాల రక్షణపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. 

ఇది కూడా చదవండి: టీచర్‌పై తూటాల వర్షం.. వర్శిటీలో దారుణం

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)