Breaking News

కుబేరుల కోసం భూగర్భ నగరి

Published on Wed, 05/07/2025 - 12:32

వాషింగ్టన్‌: అత్యంత సంపన్నులు, ఉన్నతాధికారుల కోసం అమెరికా ఏకంగా భూగర్భ నగరమే నిర్మించిందట! ఆ దేశా మాజీ ఉన్నతాధికారి కేథరిన్‌ ఆస్టిన్‌ ఫిట్స్‌ ఈ మేరకు వెల్లడించారు. అంతేకాదు, అందుకు ఏకంగా 21 లక్షల కోట్ల డాలర్ల మేరకు ప్రజల సొమ్మును వెచ్చించిందని ఆరోపించారు. జార్జ్‌ హెచ్‌.డబ్లు్య.బుష్‌ అధ్యక్షునిగా ఉండగా కేథరిన్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా పని చేశారు. 

తాను చెబుతున్నది పచ్చి నిజమని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘21 లక్షల కోట్ల డాలర్లు లెక్కాపత్రం లేకుండా మాయమయ్యాయి. ఎక్కడికి పోయాయని ఏళ్ల తరబడి పరిశోధించా. వాటిని 170 భూగర్భ స్థావరాలతో కూడిన భారీ నెట్‌వర్క్‌ నిర్మాణానికి వెచ్చించినట్టు చివరికి కనిపెట్టా. వాటి మధ్య అత్యాధునిక రవాణా తదితర సదుపాయాలు కూడా ఉన్నాయి. 1998 నుంచి 2015 వరకు రక్షణ, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖల్లో అత్యంత భారీ మొత్తాలను అనధికారికంగా ఖర్చు చేసినట్లు మిషిగన్‌ స్టేట్‌ వర్సిటీ ఆర్థికవేత్త మార్క్‌ స్కిడ్మోర్‌ అధ్యయనంలో కూడా వెల్లడైంది’’అని చెప్పుకొచ్చారు. 

కేథరిన్‌ చెబుతున్న బంకర్లలో కొన్ని సముద్రం అడుగున కూడా ఉన్నట్లు సమాచారం. ‘‘అమెరికాలో భూగర్భంలోనూ, సముద్రం అడుగునా ఈ స్థావరాలున్నాయి’’అని చెప్పారు. దాని పరిమాణం, పరిధి, యాక్సెస్‌ ప్రోటోకాల్స్‌ తదితర వివరాలేవీ ఆమె బయటపెట్టలేదు. విపత్తుల వేళ ఆ బంకర్లలోకి ప్రవేశమున్న ఉన్నత వ్యక్తుల పేర్లను కూడా ప్రస్తావించలేదు. 

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)