Breaking News

మతోన్మాదం యూరప్ కొంప ముంచుతుందా?

Published on Sun, 07/30/2023 - 07:12

యూరప్‌లో మతోన్మాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. స్వీడన్ తర్వాత ఇప్పుడు మరో యూరోపియన్ దేశం డెన్మార్క్‌లో ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను తగలబెట్టినా ఆ ప్రక్రియను ఆపే చర్యలేవీ జరగడంలేదు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో మితవాద సంస్థ ఖురాన్‌ను తగులబెట్టడంపై సౌదీ అరేబియా మొదలుకొని పాకిస్తాన్ వరకు అన్ని ముస్లిం దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

డెన్మార్క్ దౌత్యవేత్త సమక్షంలో..
ఖురాన్ దహనం చేసిన ఘటనపై ఆగ్రహించిన సౌదీ అరేబియా.. డెన్మార్క్ దౌత్యవేత్త సమక్షంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అదే సమయంలో డెన్మార్క్‌లో జరిగిన ఘటనపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా తీవ్ర విమర్శలు గుప్పించింది. తాజాగా జరిగిన సమావేశంలో సౌదీ అధికారులు డెన్మార్క్ రాయబారి ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను తక్షణం ఆపాలని డెన్మార్క్‌కు వారు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి సంఘటనలు అన్ని మతాల సందేశాలకు, అంతర్జాతీయ చట్టాలు, ప్రమాణాలకు విరుద్ధమని సౌదీ పేర్కొంది. ఖురాన్‌ను తగులబెట్టడం వల్ల వివిధ మతాల మధ్య విద్వేషాలు వ్యాపిస్తాయని తెలిపింది.

ముస్లిం దేశాల్లో తీవ్ర ఆగ్రహం 
దీనికిముందు డెన్మార్క్‌కు చెందిన పేట్రియాటర్ ఒక వీడియోను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఖురాన్‌ను తగులబెట్టడం ఆ వీడియోలో కనిపిస్తుంది. తాజాగా స్వీడన్, డెన్మార్క్‌లలో కూడా ఖురాన్‌ను దగ్ధం ఘటన అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. మక్కా, మదీనా వంటి నగరాలు కలిగిన దేశమైన సౌదీ అరేబియా.. స్వీడన్‌లో ఖురాన్‌ను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక ఇరాకీ శరణార్థి స్టాక్‌హోమ్‌లోని ప్రధాన మసీదు బయట ఖురాన్‌ను తగులబెట్టాడు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో సౌదీ అరేబియా, ఇరాక్ సంయుక్తంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ) అసాధారణ సమావేశానికి పిలుపునిచ్చాయి. దీనిలో స్వీడన్, డెన్మార్క్‌లలో ఖురాన్ దహనం చేసిన అంశంపై చర్చించనున్నారు. మరోవైపు స్వీడన్ ప్రధాని తమ దేశానికి ఉగ్రదాడుల భయం ఎదురుకావడంతో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేశారు. ఇస్లామిక్ దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు స్వీడన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఆ పాప నా మనవరాలే : బైడెన్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)