Breaking News

యెమెన్‌లోని ముకల్లాపై సౌదీ వైమానిక దాడులు

Published on Tue, 12/30/2025 - 17:33

సనా: యెమెన్‌లోని ఓడరేవు నగరం ముకల్లాపై సౌదీ అరేబియా వైమానిక దాడులు జరిపింది. మంగళవారం జరిపిన ఈ దాడులపై గల్ఫ్ వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(యూఏఈ)కి వ్యతిరేకంగా వేర్పాటువాద సమూహానికి ఆయుధాలు, సైనిక వాహనాలను అందజేస్తున్నారనే ఆరోపణలపై ఈ దాడులు జరిపినట్లు సౌదీ అరేబియా అధికారిక వార్తాసంస్థ స్పష్టం చేసింది. 

వేర్పాటు వాదుల చేతికి ఆయుధాలు చిక్కడం ఈ ప్రాంతంలో శాంతికి ముప్పుగా పేర్కొంది. అందుకే వైమానిక దళం నిర్ణీత లక్ష్యాలపై దాడులు జరిపిందని, పౌరులకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుందని వెల్లడించింది.

ఈ దాడులపై అటు యెమెన్ సీరియస్‌గా స్పందించింది. యూఏఈతో ఉన్న రక్షణ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసింది. తమ సార్వభౌమాధికారం, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యెమెన్ కౌన్సిల్ అధిపతి రషాద్ అల్-అలీమి ప్రకటించారు. ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి టీవీలో మాట్లాడారు. యెమెన్‌లో ఉన్న యూఏఈ దళాలు(అల్-అలీమీ) తమ భూభాగాన్ని 24 గంటల్లో విడిచి వెళ్లాలని ఆదేశించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మూడ్రోజులపాటు నోఫ్లై జోన్‌గా ప్రకటించారు. 90 రోజుల అత్యయిక స్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)