Breaking News

చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ఆర్చ్‌బిషప్‌గా ములాలీ

Published on Sat, 10/04/2025 - 06:15

లండన్‌: చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా మహిళా ఆర్చ్‌బిషప్‌ నియమితులయ్యారు. ఆర్చ్‌బిషప్‌ ఆఫ్‌ కాంటర్‌బరీగా డేమ్‌ సారా ములాలీ(63)ని కింగ్‌ ఛార్లెస్‌–3 నియమించారని శుక్రవారం యూకే ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దీంతో, చర్చ్‌ 500 ఏళ్ల చర్రితలో నాయకత్వ స్థాయికి ఎదిగిన మహిళా మతపెద్దగా ములాలీ చరిత్ర సృష్టించినట్లయింది. 

ప్రపంచ వ్యాప్తంగా 165 దేశాల్లో ఉన్న 8.5 కోట్ల మంది ఆంగ్లికన్‌లకు ములాలీ ఆధ్యాత్మిక నాయకత్వం వహించనున్నారు. జాతీయ ఆరోగ్య సేవల(ఎన్‌హెచ్‌ఎస్‌) విభాగంలో చీఫ్‌ నర్స్‌గా పనిచేసిన సారా ములాలీ 2006లో బోధకురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో మొట్టమొదటి మహిళా బిషప్‌ ఆఫ్‌ లండన్‌గా, చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో అత్యంత మూడో సీనియర్‌ మతపెద్దగా ఎదిగారు. గతేడాది నవంబర్‌ 12వ తేదీన రెవరెండ్‌ జస్టిన్‌ వెల్బీ రాజీనామా చేశారు. 

చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌తో సంబంధమున్న ఓ న్యాయ వాది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడి నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయం తెలిసీ సంబంధిత అధికారులకు సమాచారమివ్వలేదని విమర్శలు రావడంతో ఆయన బాధ్యతల నుంచి వైదొలిగారు. అప్పట్నుంచీ ఆర్చ్‌బిషప్‌ ఆఫ్‌ కాంటర్‌బరీ పదవి ఖాళీగా ఉంది. 106వ ఆర్చ్‌బిషప్‌ ఆఫ్‌ కాంటర్‌బరీగా మొట్టమొదటి మహిళగా సారా ములాలీ నియమితులవడాన్ని యూకే ప్రధాని స్టార్మర్‌ స్వాగతించారు.

 అయితే, 2026 జనవరిలో లండన్‌లోని సెయింట్‌ పౌల్స్‌ కేథడ్రల్‌లో జరిగే కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆర్చ్‌బిషప్‌ ఆఫ్‌ కాంటర్‌బరీగా ప్రకటించే వరకు ఆమెను ఆర్చ్‌బిషఫ్‌ ఆఫ్‌ కాంటర్‌బరీ–డిజిగ్నేట్‌గా వ్యవహరిస్తారు. అనంతరం మార్చిలో కాంటర్‌బరీ కేథడ్రల్‌లో జరిగే కార్యక్రమంలో అధికారికంగా ఆమెను ఆసీనురాలిని చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లికన్‌ కమ్యూనియన్‌ అంతటా లక్షలాది మంది ప్రజలతో విశ్వాస ప్రయా ణాన్ని పంచుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు సారా ములాలీ తెలిపారు. 

‘ఇది చాలా పెద్ద బాధ్యత అని నాకు తెలుసు. కానీ, దేవుడు ఎప్పటిలాగే నా బాధ్యతను తీసుకుంటాడనే నమ్మకంతోనే కొత్త బాధ్యతల్లోకి అడుగు పెడుతున్నాను’అని ఆమె వినమ్రంగా చెప్పారు. అంతకుముందు, నర్స్‌గా పనిచేసిన ములాలీ 2001లో కేవలం 37 ఏళ్లకే యూకే ప్రభుత్వ చీఫ్‌ నర్సింగ్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టి, చరిత్ర సృష్టించారు. చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్, గ్లోబల్‌ ఆంగ్లికన్‌ కమ్యూనియన్, కాంటర్‌బరీ డయోసెస్‌ల ప్రతినిధులతో కూడిన కాంటర్‌బరీ కోసం క్రౌన్‌ నామినేషన్స్‌ కమిషన్‌ (సీఎన్‌సీ) సారా ములాలీని ఈ పదవికి ఎంపిక చేసింది. 
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)