Breaking News

పిల్లల తిండి కోసం... పస్తులుంటున్న కెనడియన్లు

Published on Sat, 11/23/2024 - 06:23

ఒట్టావా: ఒకప్పుడు లక్షల మందికి కలల గమ్యస్థానమైన కెనడా కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న కిరాణా బిల్లులు,  గృహ నిర్మాణ ఖర్చులతో ప్రజలు సతమతమవుతున్నారు. అనేక కుటుంబాలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికే ఆపసోపాలు పడుతున్నాయి. చివరికి పిల్లలకు పౌష్టికాహారం కూడా గగనంగా మారుతోందట. 

సాల్వేషన్‌ ఆర్మీ చేసిన సర్వేలో ఇలాంటి విస్తుగొలిపే విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి. కెనడాలో 25 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి తమ ఆహారాన్ని తగ్గించుకుంటున్నారు. ఇక ఏకంగా 90 శాతానికి పైగా కుటుంబాలు కిరాణా వస్తువుల కొనుగోలును వీలైనంతగా తగ్గించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. నివేదిక 

ఇంకా ఏం చెప్పిందంటే... 
→ కెనడాలో ప్రతి నలుగురు తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లలకు మంచి ఆహారం అందించడానికి స్వీయ ఆహార వినియోగాన్ని తగ్గించారు 
→ సర్వేలో పాల్గొన్న వారిలో 90% మందికి పైగా ఇతర ఆర్థిక ప్రాధాన్యతలకు కావాల్సిన డబ్బు కోసం కిరాణా ఖర్చులు తగ్గించినట్లు చెప్పారు 
→ కెనడాలో ఫుడ్‌ బ్యాంకులు కూడా తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. 
→ దాంతో భారతీయులు సహా అంతర్జాతీయ విద్యార్థులను తిప్పి పంపాలని అవి నిర్ణయించాయి. 
→ చాలామందికి ప్రస్తుతం కనీస నిత్యావసర వస్తువుల కొనుగోలుకు సరిపడా జీవనోపాధి పొందడం కూడా కష్టంగా మారింది 
→ డబ్బుల్లేక చాలామంది చౌకగా దొరికే నాసిరకం ఆహారంతో కడుపు నింపుకుంటున్నారు 
→ అది కూడా కుదరినప్పుడు భోజనాన్ని దాటవేస్తున్నట్లు 84% మంది చెప్పారు. 

చాలామంది కెనడియన్లు తమ పిల్లలు, కుటుంబసభ్యుల రోజువారీ ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి ఇది అద్దం పడుతోంది
– జాన్‌ ముర్రే, సాల్వేషన్‌ ఆర్మీ ప్రతినిధి 
 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)