Breaking News

ఈ పోస్ట్‌కార్డు.. జీవితకాలం లేటు!

Published on Fri, 08/23/2024 - 10:05

ఇప్పుడంటే వాట్సప్, మెసెంజర్ల కాలం. కానీ వందేళ్ల కిందట సమాచారం చేరవేతకు ఏకైక మార్గం పోస్టే. ఒక లెటర్‌ చేరడానికి మూడు నుంచి వారం రోజులు, ఒక్కోసారి పది రోజుల నుంచి నెల దాకా కూడా పట్టేది. కానీ ఒక పోస్ట్‌కార్డు చేరడానికి ఏకంగా 121 ఏళ్లు పట్టింది! 1903లో పోస్ట్‌ చేసిన ఆ లేఖ శతాబ్దం ఆలస్యంగా చేరుకుంది. బ్రిటన్‌లో స్వాన్సీ బిల్డింగ్‌ సొసైటీ అడ్రస్‌తో ఉన్న ఈ క్రిస్మస్‌ థీమ్‌ కార్డు క్రాడాక్‌ స్ట్రీట్‌ శాఖకు గతవారం చేరింది. ఆ చిరునామాలో గతంలో నివసించిన మిస్‌ లిడియా డేవిస్‌ బంధువులను కనిపెట్టి ఈ కార్డు ఎవరికి రాసిందో తెలుసుకుని వాళ్లకు చేర్చాలని సిబ్బంది భావిస్తున్నారు. ఈ పోస్టుకార్డును ఎవార్ట్‌ అనే వ్యక్తి లిడియాకు రాశారు.

స్వాన్సీ బిల్డింగ్‌ సొసైటీలో 121 ఏళ్ల కిందట ఆండ్రూ డల్లీ తన భార్య మరియాతో కలిసి నివసించారు. వారి ఆరుగురు పిల్లల్లో పెద్ద కూతురు లిడియా. ఈ పోస్టు కార్డు పంపిన సమయంలో ఆమెకు 16 ఏళ్లు. వారి కుటుంబం గురించిన సమాచారం ఆన్‌లైన్‌లో చాలా తక్కువగా ఉందని స్వాన్సీ బిల్డింగ్‌ సొసైటీ వర్గాలన్నాయి. ఆమెతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారేమో కనుగొని లేఖను అందజేస్తామని చెప్పుకొచ్చాయి.

లేఖలో ఏముందంటే..
‘డియర్‌ ‘ఎల్‌’.. నన్ను క్షమించండి. నేనా జత (ఏదో తెలియని వస్తువు) తీసుకోలేకపోయాను. నువ్వు ఇంట్లో ఎంజాయ్‌ చేస్తున్నావని ఆశిస్తున్నా’ అని రాశారు. తన వద్ద 10 షిల్లింగ్‌లు ఉన్నాయని, రైలు చార్జీలను లెక్కించడం లేదని, తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. ‘గిల్బర్ట్, జాన్‌లను కలవాలి.. గుర్తుంచుకోండి’ అంటూ ముగించారు. ‘అందరికీ ప్రేమతో’అంటూ సంతకం చేశారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)