Breaking News

S Jaishankar: వివాదాలకు చర్చలే శరణ్యం

Published on Fri, 10/25/2024 - 04:09

కజన్‌: వివాదాలు, విభేదాలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాల్సిందేనని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పునరుద్ఘాటించారు. యుద్ధాలతో సాధించేదీ ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, ఉద్రిక్తతలు చల్లారాలంటే చర్చలపై తక్షణమే దృష్టి పెట్టాలని సూచించారు. రష్యాలోని కజన్‌ నగరంలో బ్రిక్స్‌ ఔట్‌రీచ్‌/బ్రిక్స్‌ ప్లస్‌ సదస్సులో చివరి రోజు గురువారం జైశంకర్‌ మాట్లాడారు. ఇది యుద్ధాల శకం కాదంటూ భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. 

శాంతియుత చర్చలు, దౌత్య మార్గాలపై దృష్టి పెడితే వివాదాలు సమసిపోతాయని పేర్కొన్నారు. దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినప్పుడు వాటిని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు ఎవరైనా సరే లోబడి ఉండాలని, ఎలాంటి మినహాయింపులు ఉండొద్దని తేల్చిచెప్పారు. ప్రపంచానికి ముప్పుగా మారిన ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు. పశి్చమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై జైశంకర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దీర్ఘకాలపు సవాళ్లను ఎదిరించే విషయంలో కొత్తగా ఆలోచించడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని చెప్పారు.   

ఐరాస భద్రతా మండలిని సంస్కరించాల్సిందే  
ప్రపంచీకరణ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందడం లేదని, ఈ నిజాన్ని బ్రిక్స్‌ వేదిక గుర్తించాలని జైశంకర్‌ కోరారు. కోవిడ్‌ మహమ్మారితోపాటు వేర్వేరు సంఘర్షణల కారణంగా గ్లోబల్‌ సౌత్‌ దేశాలపై భారం మరింత పెరిగిందన్నారు. వైద్యం, ఆహారం, ఇంధన భద్రత విషయంలో ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సరిసమానమైన ప్రపంచ క్రమం’ అవసరమని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల విషయంలో వివిధ దేశాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని, ఇవి వలసవాద పాలన నుంచి వారసత్వంగా వచ్చాయని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాలను సరి చేయాలన్నారు. 

సరుకుల సరఫరా కోసం దేశాల మధ్య అనుసంధానం మరింత పెరగాలన్నారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని గౌరవిస్తూ ఆ దిశగా అన్ని దేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి సంస్థలు, అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణలు తక్షణావసరమని జైశంకర్‌ తెలిపారు. ముఖ్యమంత్రి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు వెంటనే ప్రారంభించాలని అన్నారు. భద్రతా మండలిలో మరికొన్ని దేశాలకు శాశ్వత సభ్యత్వం కలి్పంచాలని డిమాండ్‌ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్‌∙సదస్సుకు పదికిపైగా బ్రిక్స్‌ సభ్యదేశాలతోపాటు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)