Breaking News

రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడి..విమానాశ్రయం మూసివేత

Published on Sat, 12/21/2024 - 14:10

కీవ్‌ : రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 8 డ్రోన్లను రష్యాపై ప్రయోగించింది. శనివారం కజాన్‌ నగరంలో హైరైజ్‌ బిల్డింగ్స్‌పై డ్రోన్‌ దాడులు జరిపింది. మూడు అత్యంత ఎత్తైన బిల్డింగ్‌లను డ్రోన్‌లు ఢీకొట్టాయి. డ్రోన్‌ల దాడితో కజాన్‌ ఎయిర్‌పోర్టును మూసివేశారు. కజాన్‌కు ఈశాన్య నగరం ఇజెవ్‌స్క్‌లో, కజాన్‌కు దక్షిణంగా ఉన్న సరాటోవ్‌లో మరో రెండు విమానాశ్రయాలలో తాత్కాలిక ఆంక్షలను విధిస్తున్నట్లు వెల్లడించింది.   

రాజధాని మాస్కోకు తూర్పున ఉన్న కజాన్‌లోని నివాస సముదాయాలపై డ్రోన్ దాడి జరిగినట్లు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు నివేదించాయి. ఉక్రెయిన్‌ ప్రయోగించిన వాటిలో పలు డ్రోన్‌లను కూల్చివేశామని రష్యా ప్రకటించింది. నివాస సముదాయాలపై జరిగిన డ్రోన్‌ దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. కజాన్ మేయర్ టెలిగ్రామ్‌లో మాట్లాడుతూ నగరంలో అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు,ప్రాణనష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు.

రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్

 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు