Breaking News

ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంతగడ్డ మీద రష్యా మిసైళ్ళ దాడి

Published on Tue, 06/13/2023 - 18:03

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: సోమవారం అర్ధరాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంత ఊరు క్రైవీ రిహ్ పట్టణం మీద రష్యా మిసైళ్ళతో దాడి చేసింది. డెనిప్రో పెట్రోవ్స్క్ పరిసర ప్రాంతాల్లో జనావాసాలపై జరిగిన ఈ దాడిలో ఆరుగురు మరణించగా కనీసం 25మంది తీవ్ర గాయాలు పాలై ఉంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. 

మృతులు పెరగొచ్చు.. 
రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాలను తిరిగి సాధించుకునే పనిలో ఉన్న ఉక్రెయిన్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది రష్యా. సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ సొంత పట్టణమైన క్రైవీ రిహ్ లో మిసైళ్ళతో జనావాసాలపై దాడులకు దిగింది. ఈ దాడుల్లో ప్రధానంగా ఒక ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగి నేలకూలింది. ఇదే భవనంలో ఆరుగురు మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా జరుగుతున్నాయని శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని తెలిపారు స్థానిక మేయర్ ఒలెగ్జాండర్ విల్కుల్. 

దారుణమైన దృష్యాలు.. 
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంఘటన తాలూకు ఫోటోలను కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేశారు. రష్యా  తీవ్రవాదులు జనావాసాలపైన, సామాన్య నగరాల పైన దాడులకు తెగబడ్డారని రాసి ఫోటోలు జతచేశారు. శిధిలమైన ఐదంతస్తుల భవనం, ఛిద్రమైన వాహనాలతో కూడిన ఈ ఫోటోలు హృదయవిదారకంగా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: అలర్ట్‌: ప్రపంచంలో టాప్‌-20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్‌లోనే..   

         

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)