Breaking News

మళ్లీ రష్యా వశమైన సుడ్జా టౌన్‌

Published on Fri, 03/14/2025 - 05:50

మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా క్రమంగా పైచేయి సాధిస్తోంది. ఒకవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతుండగానే, మరోవైపు ఉక్రెయిన్‌ ఆధీనంలో ఉన్న తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. రష్యా సరిహద్దు అయిన కర్క్స్‌ ప్రాంతంలోని అతిపెద్ద పట్టణం సుడ్జా మళ్లీ రష్యా సేనల చేతుల్లోకి వచ్చింది. అక్కడి నుంచి ఉక్రెయిన్‌ సైన్యాన్ని తమ బలగాలు తరిమికొట్టినట్లు రష్యా ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 

కర్క్స్‌లోని తమ సైనిక కమాండర్లను రష్యా అధినేత పుతిన్‌ బుధవారం కలిశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలో సుడ్జా టౌన్‌ రష్యా వశం కావడం గమనార్హం. సుడ్జా పట్టణం ఉక్రెయిన్‌–రష్యా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంది. రష్యా పరిధిలోకి వచ్చే ఈ పట్టణాన్ని గతంలో ఉక్రెయిన్‌ సేనలు ఆక్రమించాయి. ఇక్కడ 5,000 మంది నివసించేవారు. యుద్ధం మొదలైన తర్వాత చాలామంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. యుద్ధంలో తాము కోల్పోయిన భూభాగాన్ని మళ్లీ స్వాధీనం చేసుకోవడం అతిపెద్ద విజయంగా రష్యా సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అయితే, దీనిపై ఉక్రెయిన్‌ అధికార వర్గాలు ఇంకా స్పందించలేదు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)