Breaking News

అమెరికా విలేఖరికి 16 ఏళ్ల జైలు శిక్ష

Published on Sat, 07/20/2024 - 05:01

యెకటేరిన్‌బర్గ్‌ (రష్యా): అమెరికా కోసం రహస్య పత్రాలు సేకరిస్తూ గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ప్రఖ్యాత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు చెందిన 32 ఏళ్ల రిపోర్టర్‌ ఇవాన్‌ గెర్‌‡్షకోవిచ్‌కు రష్యా న్యాయస్థానం 16 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిని పూర్తిగా కల్పిత సాక్ష్యాలతో సృష్టించిన తప్పుడు కేసుగా అమెరికా అభివర్ణించింది. శుక్రవారం రష్యాలోని సెవెర్డ్‌లోవోస్క్‌ ప్రాంతీయ కోర్టు జడ్జి ఆండ్రీ మినియేవ్‌ ఈ తీర్పు చెప్పారు.

 తీర్పుకు ముందు నీవేమైనా చెప్పేది ఉందా? అని జడ్జి ప్రశ్నించగా లేదు అని ఇవాన్‌ సమాధానమిచ్చారు. ఇవాన్‌కు 18 ఏళ్ల శిక్ష విధించాలని ప్రభుత్వ లాయర్లువాదించగా జడ్జి 16 ఏళ్ల శిక్ష వేశారు. శిక్ష ఖరారుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పందించారు. ‘‘ జర్నలిస్ట్, అమెరికన్‌ పౌరుడు అయినందుకే ఇవాన్‌ను బంధించి జైలుపాలుచేశారు. 

ఐరాస కూడా ఇదే మాట చెప్పింది. అతడిని విడిపించేందుకు అమెరికా తన ప్రయత్నాలు ఇకమీదటా కొనసాగిస్తుంది. పాత్రికేయ వృత్తి నేరం కాబోదు’ అని అన్నారు.  ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అమెరికా జర్నలిస్ట్‌ను రష్యా అరెస్ట్‌చేయడం ఇదే తొలిసారి. యురాల్వగోన్జవోడ్‌ సిటీలో రష్యా యుద్ధట్యాంకుల తయారీ, రిపేర్ల రహస్య సమాచారాన్ని ఇవాన్‌ సేకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడని ఆరోపిస్తూ 2023 మార్చి 29న ఇవాన్‌ను అరెస్ట్‌చేయడం తెల్సిందే.
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)