Breaking News

పశ్చిమ ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు

Published on Thu, 11/20/2025 - 06:20

కీవ్‌: ఉక్రెయిన్‌పై నెలలతరబడి దురాక్రమణ రంకెలేస్తున్న రష్యా బుధవారం ముప్పేటదాడి పాతిక మంది ప్రాణాలను బలితీసుకుంది. పశ్చిమాన ఉన్న టెర్నోపిల్‌ నగరంపై బుధవారం రష్యా జరిపిన దాడుల్లో ముగ్గురు చిన్నారులుసహా 25 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్‌ అంతర్గత మంత్రి ఇహర్‌ కిలిమెంకో ధ్రువీకరించారు. 

రష్యా ఆక్రమణలను అడ్డుకునేందుకు, దౌత్య మద్దతు కోసం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తుర్కియేకు వచ్చిన సమయంలోనే రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. సిటీలోని రెండు బహుళ అంతస్తుల భవనలపై రష్యా ఎక్స్‌–101 క్రూయిజ్‌ క్షిపణులతో దాడులు చేసింది. దీంతో భవనాలు ధ్వంసమై 73 మంది తీవ్రంగా గాయపడ్డారని కిలిమెంకో వెల్లడించారు. 15 మంది చిన్నారులు రక్తమోడుతున్న దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. 

48 క్షిపణులు, డ్రోన్లుసహా మొత్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రిదాకా 24 గంటల్లో ఏకంగా 476 సార్లు రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్‌ వాయుసేన పేర్కొంది. ఇటీవలికాలంలో రష్యా ఈస్థాయిలో దాడులుచేయడం ఒకేరోజు పాతికమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. పశ్చిమదేశాలు అందించిన అత్యాధునిక ఎఫ్‌–16 యుద్ధవిమానాలు, మిరాజ–2000 జెట్‌ల సాయంతో 10 క్రూయిజ్‌ క్షిపణులను నేలకూల్చామని ఉక్రెయిన్‌ వెల్లడించింది. మరోవైపు తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌తో చర్చల ద్వారా రష్యాను ఏకాకిని చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తానని జెలెన్‌స్కీ చెప్పారు.  

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)